'ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారు..?'
శ్రీకాకుళం : సీఎం చంద్రబాబు సర్కార్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను లాక్కొని శ్రీకాకుళం ప్రజలను మరోసారి మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఆరోపించారు.
శ్రీకాకుళంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆముదాలవలస కో ఆపరేటివ్ ఘగర్ ఫ్యాక్టరీ భూములను ఏపీఐఐసీకి కేటాయించడం సరికాదన్నారు. ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు...భూములను ఏపీఐఐసీకి ఎలా బదలాయిస్తారని..? తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.