
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద ఏపీఐఐసీ ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు లభించాయి. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనుంది.
ఇందులో 1,371.52 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, మిగిలిన స్థలాన్ని మౌలికవసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పారిశ్రామిక పార్కుకు కీలకమైన పర్యావరణ అనుమతులు రావడంతో మౌలికవసతుల అభివృద్ధి కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment