'విశాఖలో భూముల కొరత వాస్తవమే'
హైదరాబాద్: విశాఖపట్నంలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకొస్తున్నాయని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. పరిశ్రమలు పెట్టేందుకు భూమి కొరత ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. భూమి లభ్యతపై ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌ను నివేదిక కోరామని వెల్లడించారు.
నిజాంపట్నం, రేపల్లె మధ్య పార్మాసిటీ రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్రానికి లేఖ రాసినట్టు హరిబాబు తెలిపారు. విశాఖను మెగా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని 'రాజధాని' ప్రకటన సందర్భంగా టీడీపీ సర్కారు హామీయిచ్చింది.