
సాక్షి, అమరావతి: విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) పార్కును అభివృద్ధి చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం ఉన్నతాధికారులతో సహా పార్కు నెలకొల్పేందుకు ముందుకొచ్చిన భూమి వరల్డ్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వంద ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా.. 20 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ‘భూమి వరల్డ్ గ్రూప్’ ప్రతిపాదనపై చర్చించారు. దీన్ని మరోసారి పరిశీలించి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది పాల్గొన్నారు.
ఇండో–జపాన్ ప్రతినిధుల భేటీ
మంత్రి గౌతమ్‌రెడ్డితో ఇండో–జపాన్ ప్రతినిధులు మరోసారి సమావేశమయ్యారు. పెట్టుబడులు, ఐటీ పార్కులు, సెజ్‌లు, టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ తదితర అంశాలపై మంత్రి చర్చించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్డీసీ చైర్మన్ కొండూరు అజయ్, ఏపీఎస్‌ఎస్డీసీ ఎండీ బంగార్రాజు, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment