
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment