ఆంధ్రప్రదేశ్లో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం కృష్ణా జిల్లాలో 460 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం కృష్ణా జిల్లాలో 460 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి అగిరిపల్లి మండలంలోని తోటపల్లిలో 460 ఎకరాల భూమిని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎకరా రూ. 6 లక్షల మార్కెట్ విలువతో ఈ భూమిని ఏపీఐఐసీకి కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు.