
నెల్లూరు(క్రైమ్): ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు కేంద్రాల వద్ద సోమవారం బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో జిల్లాలో ఏర్పాటు చేసిన 52 కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. డిపాజిట్‌దారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసులు కేంద్రాల వద్ద మైక్‌సెట్లలో వారికి అవసరమైన సమాచారం అందించారు. నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాల్లో నెల్లూరు నగరం, రూరల్ పరి«ధిలోని డిపాజిట్‌దారుల వివరాలు నమోదు కార్యక్రమం నోడల్ అధికారి, ఎస్సీ,ఎïస్టీ సెల్ డీఎస్పీ–1 శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించారు.
తొలి మూడురోజు లు రోజుకు 500 మంది చొప్పున డిపాజిట్‌దారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సోమవారం ఆ సంఖ్యను రెట్టింపు చేయడంతో పోలీసు కవాతుమైదానం కిక్కిరిసింది. డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు పోటీపడ్డారు. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సరిపడే సిబ్బంది లేకపోవడంతో సాధ్యమైనంత మేర డిపాజిట్‌దారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా 2,392మంది వివరాలను నమోదు చేశారు.