
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. ఈ నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగిందని తెలిపారు. బినామీలుగా అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసిన వారిని శిక్షించే చిత్తశుద్ధి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్యానించారు. త్వరలోనే బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా, సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్ల రూపాయల కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment