అగ్రి, అక్షయగోల్డ్ ఆస్తులపై సీఐడీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ పోర్టల్ పనితీరును ఉమ్మడి హైకోర్టు గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా తమకున్న పలు సందేహాలను నివృత్తి చేసుకుంది. అనంతరం పోర్టల్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ ఆస్తులను ఈ పోర్టల్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకుగాను ఆస్తుల వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, వాటి తాలూకు ఫొటోలు తదితర వివరాలను సిద్ధం చేసి తమ ముందుంచాలని ఏపీసీఐడీ అధికారులను ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారాలపై హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై పలుమార్లు విచారణ చేపట్టిన రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ అధికార ఈ పోర్టల్ పనితీరు గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ పోర్టల్ ద్వారా ఆస్తుల వేలం
Published Fri, Apr 21 2017 1:39 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
Advertisement