సాక్షి, కృష్ణా జిల్లా : జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో అగ్రిగోల్డ్ ఏజెంట్ మదపాటి జోజి కుమారి(35) గుండె పోటుతో మృతి చెందారు. హయ్‌లాండ్ ఆస్తులు అగ్రిగోల్డ్‌ది కాదని వచ్చిన వార్తలతో మనస్తాపానికి గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు పెద్దఎత్తున కుమారి ఇంటికి తరలివచ్చారు. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును కలిసి కుమారి మరణ వార్తను వివరించారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సబ్‌కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment