
సాక్షి, విజయవాడ : న్యాయం కోసం అగ్రిగోల్డ్ బాధితులు ఉద్యమ బాట పట్టనున్నారు. గురువారం విజయవాడలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి రావు బుధవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యవర్గ సమావేశం అనంతరం, ఈ నెల 13న దాసరి భవన్‌లో అసోసియేషన్ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అందులో ప్రభుత్వ వైఖరిపై, తాజా పరిణామాల నేపథ్యంలో బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment