ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.రూ.10 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలన్న అభ్యర్థనను జీఎస్‌ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. కోర్టు సమయాన్ని వృథా చేసిన జీఎస్‌ఎల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్, న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జీఎస్‌ఎల్ గ్రూప్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదే సమయంలో 10 ఆస్తులను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన 10 ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని హైకోర్టు, ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఆస్తుల విక్రయానికి త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. కార్పస్ ఫండ్‌ను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసుపై తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ కేసుపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ..20 వేల ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరు. రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం అడ్వాన్స్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలల్లో బాధితులకు డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ ద్వారా ఇప్పటివరకూ జమ అయిన నగదును జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment