హాయ్‌లాండ్ విలువ 600 కోట్లు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను సీఐడీ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన మొత్తం 229 ఆస్తుల వివరాలు ఈ సందర్భంగా హైకోర్టుకు అందాయి.
ఇందులో అత్యంత విలువైన 9 ఆస్తుల విలువ రూ. 1200 కోట్లు, 90 ఎకరాల హాయ్‌లాండ్ విలువ రూ. 600 కోట్లు అని సీఐడీ కోర్టుకు తెలిపింది. మొత్తం రూ. 2000 కోట్ల విలువైన ఆస్తుల వివరాలను సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. అగ్రీగోల్డ్ ఆస్తులన్నీ ఆన్‌లైన్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.