అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ డిపాజిటర్స్, ఏజెంట్ల సంక్షేమ సంఘం కార్యకలాపాలపై ఉమ్మడి హైకోర్టు సోమవారం సీఐడీ విచారణకు ఆదేశించింది. విజయవాడ సమీపంలోని ఆస్తుల కొనుగోలు నిమిత్తమంటూ డిపాజిటర్ల నుంచి ఆ సంఘం డబ్బు వసూలు చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలిచ్చింది.
ఈ సంఘం వెనుక ఎవరు న్నారు.. ఇప్పటివరకు ఎంత మొత్తం వసూలు చేశారు.. ఈ వసూలు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి.. తదితర వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వారి వెనుక ఎవరున్నారో తేల్చండి!
Published Tue, Jan 31 2017 2:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement
Advertisement