ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వ పెద్దలు కాజేయాలని టీడీపీ నేతలు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల ధర్నాలో ఆళ్లనానితో పాటు ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం కన్వీనర్ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మీ, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఏలూరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధిత సంఘం కన్వీనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మట్టి, ఇసుకతో పాటు అగ్రిగోల్డ్ ఆస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూ.1100 కోట్లు వెంటనే విడుదల చేసి బాధితులను ఆదుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయాలని కుట్ర: ఆళ్ల నాని
Published Thu, Jan 3 2019 4:43 PM | Last Updated on Thu, Jan 3 2019 6:50 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment