
అగ్రి ఆస్తులను కొట్టేయాలని చూస్తే ఉద్యమిస్తాం
అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థ ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తే వామపక్షాలతో కలసి..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
సాక్షి, అమరావతి బ్యూరో: అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థ ఆస్తులను తక్కువ ధరకు దక్కించుకోవాలని చూస్తే వామపక్షాలతో కలసి ఉద్యమిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం నుంచి వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని ప్రయత్నించకూడదని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. శవాల మీద చిల్లర ఏరుకునేలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరించకూడదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులతో ఆయన విజయవాడలో గురువారం ముఖాముఖి జరిపారు.
మొదట అగ్రిగోల్డ్ బాధితులు కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. చట్టం బలవంతులపట్ల బలహీనంగానూ బలహీనుల పట్ల బలంగానూ పనిచేస్తోందన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ఆర్థిక నిపుణులతో ఓ కమిటీ నియమించాలని సూచించారు.