సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులకు పరిష్కారం చూపేందుకు సీఐడీ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో గురువారం ఈ సమావేశం జరిగింది. బ్యాంకర్స్, అగ్రిగోల్డ్ యాజమాన్యం, బాధితుల సంఘం, పిటిషనర్లు, అడ్వొకేట్లతో సీఐడీ అధికారులు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల స్వాధీనం చేసుకోవడం, ఆస్తుల అమ్మకం, డిపాజిట్‌దారులకు పంపిణీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ బాధితులకు వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అగ్రిగోల్డ్ బాధితులు, యాజమాన్యం, సీఐడీ అధికారులతో త్వరలోనే సమావేశం కానున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment