అగ్రిగోల్డ్‌ భూములను బహిరంగ వేలం వేయాలి | ysrcp demands ap governemnt to open auction over agrigold lands | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 21 2017 3:33 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

అగ్రిగోల్డ్‌ భూములను బహిరంగంగా వేలం వేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘అగ్రిగోల్డ్‌ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. భూ దోపిడీ, మద్యంపై ఉన్న శ్రద్ధ అగ్రిగోల్డ్‌పై లేదు. చిన్న చిన్న ఫ్లాట్లు చేసి అగ్రిగోల్డ్‌ భూములను అమ్మాలి. ప్రభుత్వం తమవారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం. ఐవైఆర్‌ కృష్ణారావు గవర్నర్‌ను కలిస్తే ఆయనకు కూడా ముప్పు ఉంటుందేమో. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు సర్కార్‌ భయపడుతోంది.’ అని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement