అగ్రిగోల్డ్ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా ప్రెస్‌మీట్‌లో స్పీకర్ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని విమర్శించారు.