Speaker A P Legislative Assembly
-
స్పీకర్ గారూ.. మీకు ఇది తగునా?
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సీట్లు మిగిలితే వాటిని ఇతరులకు కేటాయించాలంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వినతిపత్రం ఇవ్వడం సిగ్గు చేటు అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విమర్శించారు. ఢిల్లీలో అక్టోబర్ 10న స్పీకర్ కోడెల ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సీట్లు ఎందుకు మిగిలిపోయాయో ఆలోచించి, వారిని చేర్చేలా చర్యలు తీసుకోవడానికి బదులు.. మిగిలిన సీట్లన్నీ ఇతరులకు లాటరీ పద్ధతిలో కేటాయించేలా జీవో ఇవ్వాలంటూ విన్నవించడం దళిత వ్యతిరేక చర్య తప్ప మరొకటి కాదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో సీట్లు మిగిలి పోవడానికి ప్రభుత్వ ప్రచారం లేకపోవడమే కారణమన్నారు. ఒక బాధ్యతగల ప్రజా ప్రతినిధిగా వున్న స్పీకర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి దళిత కాలనీలకు వెళ్లి కేంద్రీయ విద్యావిధానంపై అవగాహన కల్పించలేకపోయారని, వారిని ఆ విద్యాలయంలో చేర్చేలా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శించారు. -
స్పీకర్ పదవిని అడ్డుపెట్టుకొని అక్రమ వ్యాపారం..
-
ఏపీ స్పీకర్‌కు హైకోర్టు ఉత్తర్వులు
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కాకుండా మినహాయింపు చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(పీపీఆర్) కోర్టుకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల హాజరు కావాల్సిందిగా, గతంలో ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 2016 జూన్ 19 రోజున ఒక టీవీ ఛానల్ ఇంటర్వూ్యలో శివప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ట్లు చెప్పారు. ఇది ఎన్నికల సంఘం నిర్ణయించిన ఖర్చు కంటే 40 రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువని పేర్కొంటూ కరీంనగర్‌కి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనపై కోర్టులో కేసు వేశారు. ఫిర్యాదు విచారణ నిమిత్తం బుధవారం శివప్రసాద్ కోర్టుకు హాజరు కావల్సి ఉండగా దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు హాజరును నిలుపుదల చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసిందని, వాటి ప్రతిని ఆయ న తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణను ఆగస్టు 22కి జడ్జి వాయిదా వేశారు. -
కోడై కూసిన మీడియా
మహిళల భద్రతపై ఏపీ స్పీకర్ కోడెల వ్యాఖ్యలను సాక్షి మీడియా వక్రీకరించిందని ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కానీ అంత కంటే మిన్నగా జాతీయ, అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేయలేదా? ‘ఆడది తిరిగి చెడింది–మగాడు తిరగక చెడ్డాడు’.. ఇది స్త్రీలను ఇళ్లకి కట్టిపడేసేందుకు సమాజం ప్రచారంలో పెట్టిన నానుడి. దురదృష్టవశాత్తూ దీన్ని బలపర్చేవిధంగానేlరాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ‘మహిళా పార్లమెంట్’ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దీన్నే నిరూ పించాయి. వాహనాలు బయటకొచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలున్నట్టే స్త్రీలు బయటకొచ్చినప్పుడు అత్యాచారాలూ వేధింపులూ జరుగుతాయనడం, ఇంటి పట్టునుంటే ఆడవాళ్లపై ఎలాంటి అఘాయిత్యాలూ జరగవనడం పై నాను డినే గుర్తు చేస్తున్నాయి. ఓవైపు స్త్రీ సాధికార తను వల్లె వేస్తూ మరోవైపు వాళ్ల సామాజిక జీవితాన్ని వ్యతి రేకించడం ఏలికల నిజస్వరూపాన్ని వెల్లడిస్తోంది. సాధికార స్ఫూర్తిని మింగేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా సీరియస్‌గానే స్పందించింది. ‘సాక్షి’ సహా ప్రాంతీయ–జాతీయ పత్రికలూ చానళ్లూ స్పీకర్ వ్యాఖ్యల్ని శీర్షికలు చేశాయి. వాహనంతో ముడిపెట్టి ఆయన ప్రవచించిన మహిళా భద్రతా సిద్ధాంతాన్ని పాఠకుల ముందుంచాయి. స్త్రీల హక్కుల అంశం ఎంతో కొంత చర్చనీయాంశమవుతున్న సామాజిక సందర్భంలో ఈ తరహా కవరేజీ అభినందనీయం. స్త్రీ పురుష సమానత్వం సాకారమయ్యేందుకు మరో 170 ఏళ్లు వేచి ఉండక తప్పదన్న సర్వేలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరగా సమానత్వం వచ్చేందుకు పోరాడాలని ప్రవచించడమే కాకుండా, కోడెల మాటల్లో తప్పు లేదని తేల్చేశారు! ఆయన వ్యాఖ్యల్ని లోకానికి చాటిన మీడియాపై అప్పట్లో బాబు కోపగించు కున్నారు. లక్షలాది కుటుంబాలతో ముడివడిన ‘అగ్రిగోల్డ్’ అంశాల్ని పక్కదారి పట్టించేందుకు గురు వారం అసెంబ్లీలో మళ్లీ కోడెల వ్యాఖ్యల్ని ముందుకు తెచ్చారు. స్పీకర్ మహిళా వ్యతిరేక వ్యాఖ్యల్ని ఉన్నవి ఉన్నట్టుగా అందించిన ‘సాక్షి’ మీడియాపై నిప్పులు కక్కారు. నిజానికి, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘ఇండియా టుడే’ ‘దక్కన్ క్రానికల్’ ‘డీఎన్ఏ’ సహా వివిధ పత్రికలూ వెబ్సైట్లూ సైతం స్పీకర్ వ్యాఖ్యల్ని హైలెట్ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘హఫింగ్టన్ పోస్టు’ సైతం దాన్ని లోకల్వార్తగా కొట్టేపడేసి వదిలేయలేదు. కానీ సీఎం మాత్రం యథాప్రకారం ‘సాక్షి’పై ఎటాక్ చేశారు. కోడెల వ్యాఖ్యలు ‘మహిళా పార్లమెంటు’లో ప్రస్తావనకే రాకపోవడాన్ని తన కథనంలో తొలి వాక్యం చేసుకున్నారు ‘హిందూ’ ప్రతినిధి (తేదీ : 12.2.17). రేపిస్టుల్ని జైళ్లలో పెట్టాల్సిన వాళ్లు ఆడ వాళ్లను కట్టడి చేయడంపై ‘ఆప్’ ఎమ్మెల్యే అల్కా లంబా ఆగ్రహించడం, మంత్రి వ్యాఖ్యల్ని యువ తులు ఖండించడం వంటి విషయాల్ని ఆమె తన కథనంలో వివరించారు. సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండన మండనలకు గురైన ఆయన వ్యాఖ్యలు ఆ వేదికపై ప్రస్తావనకే రాకపోవడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు. ఏలికలు తమకోసం తాము ఏర్పాటు చేసుకున్న ఇలాంటి కూటముల్లో ప్రశ్నలకూ ప్రస్తావనలకూ చోటివ్వరు. సాధికారత సంగతి అటుంచి, స్త్రీలు ఎదుర్కొంటున్న వేధిం పులపై అవగాహన లేని ‘సర్కారీ పార్లమెంట్’పై వెలువడిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో వాళ్లకి పని లేదు. తమ ‘ఖ్యాతి’ని లోకానికి చాటే మీడియా సంస్థ వాళ్లకు ఉండనే ఉంది. అది కోడెల వ్యాఖ్యల్ని కత్తిరించేసి, సాధికార రంగుల స్వపాన్ని కంటికి కట్టే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ‘పాజిటివ్’గా ఉండాలంటున్నారు ముఖ్యమంత్రి. అదే జరిగితే మీడియా తన మౌలిక విలువల్ని పూర్తిగా విస్మ రించినట్టే. మహిళల భద్రత గురించి కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యలపై సాక్షి మీడియా ఏమని నివేదిం చిందో సరిగ్గా దాన్నే జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వెబ్ సైట్లు నివేదించాయి. ఇంకా చెప్పా లంటే ఇంతకన్నా ఎక్కువగానే అవి టైటిల్స్‌లో కూడా వ్యంగ్యంగా తీసుకొచ్చాయి. ఆడపిల్లలు గతంలోలాగే హౌస్వై‹ఫ్లా ఉంటే వాళ్ల మీద ఏమీ జరగవు. మహిళలు పని కోసం, చదువుల కోసం బయటకు వెళ్లినప్పుడే వారు ఈవ్‌టీజింగ్, వేధింపు, అత్యాచారం, కిడ్నాప్ వంటివాటికి గురవుతు న్నారు’’ అని కోడెల అన్నట్లు హఫింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇక thequint.com వెబ్సైట్ అయితే 'How to Avoid Rape? Stay Home Like Parked Car, Says Sexist Minister' అని ఈ వార్తకు టైటిల్ కూడా పెట్టేసింది. (https://goo. gl/YnQfbl). నానా రకాల అణచివేతలు ఎదుర్కొంటూ, అవకాశాల కోసం పెనుగులాడుతూ ఈ స్థాయికి వచ్చిన స్త్రీలు ఇప్పడున్న సవాళ్లనూ అధిగమిస్తారు. ఇంటా బయటా ఎదురవుతున్న యాతనల్ని ఎదు ర్కొంటూ ముందుకే సాగుతారు. (మన స్పీకర్‌కి ఇంట్లో జరిగే అఘాయిత్యాలపై బొత్తిగా అవగాహన లేనట్టుంది) జీవితమంటే ఎదుర్కోవడమే. ఈ క్రమంలో వాళ్లు పడిలేచే కడలి తరంగాలవుతారు. తమ జీవితాలపై పట్టు సాధించుకుంటారు. మనం పరిశీలించదలిస్తే వర్తమాన సమాజంలో ఎటు చూస్తే అటు ఇలాంటి దృశ్యాలే అగుపిస్తాయి. ఏలి కలూ.. మచ్చుకి తుందుర్రు వైపు చూడండి. – వి.ఉదయలక్ష్మి -
'అగ్రిగోల్డ్' అంశాన్ని అటకెక్కించేందుకే: వైఎస్ జగన్
హైదరాబాద్: అగ్రిగోల్డ్ అంశంపై చర్చను పక్కదోవ పట్టించేందుకే స్పీకర్ వ్యాఖ్యల అంశాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 20 లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ అంశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి పేరు ప్రస్తావనకు రావడంతోనే ఉద్దేశపూరితంగా అసెంబ్లీలో చర్చను అటకెక్కించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా ప్రెస్మీట్లో స్పీకర్ చేసిన వ్యాఖ్యల అంశాన్ని కావాలనే తెరపైకి తెచ్చారని విమర్శించారు. మహిళల అత్యాచారాలపై స్పందిస్తూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఒక్క 'సాక్షి' మీడియానే కాకుండా రాష్ట్రంలోని అన్ని చానెళ్లు, జాతీయ మీడియా సైతం ప్రచురించాయని, అలాంటప్పుడు ఒక్క 'సాక్షి' మాత్రమే ఆయన వ్యాఖ్యలను ప్రచురించినట్టు ప్రభుత్వం హంగామా చేస్తున్నదని దుయ్యబట్టారు. ఇంటియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ వంటి ఆంగ్ల మీడియాలో సైతం ఏపీ స్పీకర్ మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి అంటూ కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు డైరెక్షన్‌కు కాలువ శ్రీనివాసులు యాక్షన్, స్పీకర్ రియాక్షన్..ఇలా అన్ని కలిసొచ్చి అగ్రిగోల్డ్ అంశం అటకెక్కిందని తప్పుబట్టారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. స్పీకర్ వ్యాఖ్యల అంశం అసలు సభకు సంబంధించినది కాదు. ఈ అంశంపై వీడియోలు ప్రసారం చేయడం సభ సమయాన్ని వృథా చేయడమే. ప్రజాస్వామ్యం నాలుగుకాళ్ల మీద నడువాలంటే అందరూ ఏకం కావాలి నచ్చని టీవీ చానెళ్ల మీద ఇష్టమొచ్చినట్టుగా చర్య తీసుకుంటామంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు ప్రయత్నించి.. నోటుకు ఓటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగులు ఎందుకు అసెంబ్లీలో ప్రదర్శించడం లేదు ఆ టేపులు శాసనసభలో ప్లే చేయాలని చంద్రబాబుకు, స్పీకర్‌కు అనిపించలేదా? అగ్రిగోల్డ్‌కు రూ. 7వేల కోట్ల విలువచేసే భూములు ఉన్నాయి అయినా, ఏడాదిన్నర కాలంలో కేవలం రూ.16 కోట్ల ఆస్తులు మాత్రమే అమ్మారు అగ్రిగోల్డ్ ఆస్తుల నుంచి రూ. 1180 కోట్లు ఇస్తే 13 లక్షలమంది బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇదే అగ్రిగోల్డ్ బాధితుల ప్రధాన డిమాండ్. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అగ్రిగోల్డ్ వ్యవహారంలో 105మంది చనిపోయారు. వారికి కేవలం రూ. 3 లక్షల పరిహారం ఇచ్చారు. చంద్రన్న పథకం కింద రూ. 5 లక్షల ఎక్స్గ్రెషియా ఇస్తూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ముష్టి మూడు లక్షలా? అగ్రిగోల్డ్ చైర్మన్, అతని ఒక తమ్ముడిని మాత్రమే అరెస్టు చేశారు. మిగతావారు బయట ఉండి ఆస్తులు అమ్ముతున్నారని బాధితులు చెప్పారు. సీఐడీ విచారణ ప్రారంభించాక అగ్రిగోల్డ్ ఆస్తులను కొంతమంది కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అందులో మంత్రి పత్తిపాటి పుల్లారావు సతీమణి ఉన్నారు అగ్రిగోల్డ్‌పై కేసులు నమోదయ్యాక తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్టు మంత్రి పుల్లారావే స్వయంగా అంగీకరించారు అగ్రిగోల్డ్ డైరెక్టర్ సీతారాం తిరుపతిలోని హోటల్‌ను రూ. 14 కోట్లకు అమ్మారు సీతారాం భార్య పుష్పలత 31 ఎకరాలు, కూతురు 8 ఎకరాలు విక్రయించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. మంత్రి పుల్లారావు దినకరన్ నుంచి భూములు కొనుగోలు చేశారు. ఆ దినకరన్ హాయ్‌లాండ్‌కు సీఈవో, డైరెక్టర్. కానీ మంత్రేమో దినకరన్‌కు, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటున్నారు హాయ్‌లాండ్ ఆస్తులు వేలం పరిధిలోకి రావా? అగ్రిగోల్డ్ వ్యవహారంలో హాయ్‌ల్యాండ్ ఆస్తులు, యరాడ వద్ద ఉన్న విలువైన ఆస్తులు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ ఆస్తులను కూడా వేలం వేయాలి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిబోయి.. స్పీకర్‌ను అడ్డం పెట్టుకొని సభను తప్పుదోవ పట్టించారు. పుల్లారావు భూముల కొనుగోలుపై హౌజ్ కమిటీ వేద్దామని ప్రభుత్వం అంటోంది హౌస్ కమిటీ వేస్తే.. ప్రివిలేజ్ కమిటీలానే ఉంటుంది ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరపాలి -
'అగ్రిగోల్డ్' అంశాన్ని అటకెక్కించేందుకే
-
మహిళలపై నా మాటలను వక్రీకరించారు
-
మహిళా ప్రోత్సాహంపై స్పష్టత ఉంది
ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి: ఆడ బిడ్డలను ప్రోత్సహించడంలో తాను చాలా స్పష్టతతో ఉంటానని, వీటిపై తనకు రెండో అభిప్రాయం వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని ఉండదని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్, పార్లమెంటు సదస్సు నిర్వాహకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఎవరైనా తనపై చెడు అభిప్రాయం కల్పించడానికి ప్రయత్నిస్తే అది అవాస్తవం అవుతుందని, మహిళలకు వ్యతిరేకమైనవి తన నోటి వెంట రావని, చేతల్లో కూడా జరగవని మరోసారి మనవి చేసుకుంటున్నానన్నారు. చివరి రోజున ఆదివారం మహిళా పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంటు మూడు రోజు ల పాటు బ్రహ్మాండంగా జరిగిందన్నారు. కార్యక్ర మం ఎంత గొప్పగా జరిగినా చెడగొట్టడానికి ఎక్కడో ఒక చిన్న ప్రయ త్నం జరిగిందని తాను అనుకుంటున్నానని కోడెల అన్నారు. యువ మహిళలు, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన వారు చేసిన ప్రసంగాలు విద్యార్థినులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు. దేశ, విదేశాల నుంచి చాలా మంది ప్రజా ప్రతినిధులు, ఏపీ కి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు హాజరై తమ అనుభవాలను పంచుకున్నార న్నారు. మొత్తం మీద ఈ మహిళలంతా తమ ఆకాంక్షలకు అనుగుణంగా సూచనలు చేసి యావత్ మహిళా లోకానికే దిక్సూచిగా నిలి చారని కోడెల అభిప్రాయపడ్డారు. -
స్పీకర్ సాబ్.. జర సున్లో..
• సభలో మహిళా ప్రజాప్రతినిధులను మాట్లాడనివ్వండి • కోడెలను కోరిన జమ్మూకశ్మీర్ ఎమ్మెల్సీ షెహ్నాజ్ సాక్షి, అమరావతిబ్యూరో: ‘ఏపీ స్పీకర్ ఇదే వేదిక మీద ఉన్నారు. ఆయన నా మాటలు కాస్త ఆలకించాలి. ఆయనతోపాటు దేశంలోని అందరు స్పీకర్లకు నేను చెప్పేదొకటే. చట్టసభల్లో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏదైనా అంశంపై ప్రసంగించేందుకు నిలబడగానే స్పీకర్ బెల్ కొట్టేస్తారు. ఇక మేం ఏం మాట్లాడేది? మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ గొంతును ఎలా వినిపించాలి? చట్టసభల్లోనే మహిళలు మాట్లాడేందుకు అవకాశం లేకపోతే బయట ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. అందుకే చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వండి..’ అని జమ్మూకశ్మీర్ ఎమ్మెల్సీ డాక్టర్ షెహ్నాజ్ కోరారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు రెండోరోజు ఆమె మాట్లాడారు. చట్టసభల్లోనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు తమ స్వరాన్ని బలంగా వినిపించాల్సిన ఆవస్యకత ఉందన్నారు. ప్రపంచం మహిళల వాదన వినాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలు తమ న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. -
నేషనల్ ఉమెన్ పార్లమెంట్‌పై స్పీకర్ సమీక్ష
- హాజరైన ఎంఐటీ ప్రతినిధులు అమరావతి : నేషనల్ ఉమెన్ పార్లమెంట్ నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బుధవారం చర్చించారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి చర్చా వేదికలో అమరావతి వేదికగా సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఎంఐటీ ప్రతినిధి రాహుల్ కరాడ్, స్పెషల్ ఆఫీసర్ రామలక్ష్మిలు చర్చలో పాల్గొన్నారు. పూనేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ మొత్తం కార్యక్రమాన్ని సమన్వయపరుస్తుంది. 110 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా మహిళా పార్లమెంటు, శాసనసభ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మంది విద్యార్థినులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల వసతి, ఇతర అంశాలపై విజయవాడ మునిసిపల్ కమిషనర్ వీరపాండ్యన్, బస్ కలెక్టర్ లక్ష్మీషాలతో సభాపతి కోడెల చర్చించారు. యునెస్కో కూడా ఈ సదస్సులో భాగస్వామి కాబోతున్నది. మహిళా పార్లమెంటేరియన్లు, వివిధ రంగాల్లో నిష్నాతులైన మహిళా ప్రముఖులను కూడా స్పీకర్ ఆహ్వానిస్తారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ పౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఈ సమావేశాలు నిర్వహిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామి కానుంది. ఇప్పటి వరకు సిద్ధం చేసిన తాత్కాలిక కార్యాచరణను అనుసరించి ‘మహిళా ప్రోత్సాహం- ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై మూడు రోజులు మహాసభలు జరగనున్నాయి. విభిన్న అంశాలు కూడా ఈ సభల్లో చర్చకు రానున్నాయి. తొలిరోజు ‘మహిళా సాధికారిత-రాజకీయ సవాళ్ళు, వ్యక్తిత్వ నిర్మాణం, భవిష్యత్ దార్శనికత, గురుశిశ్యుల సంబంధాలు’ అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. రెండో రోజు ‘మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి, మీకు మీరే సాటి’ అనే అంశంపై ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయి. మూడో రోజు మహిళా సాధికారిత కోసం పరుగు నిర్వహిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కమిటీకి ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను చైర్మన్‌గా నియమించాలని సభాపతి నిర్ణయించారు. కార్యక్రమం విజయవంతానికి తగిన సమయం కావాలని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధులు డాక్టర్ కోడెలకు విజ్ఞప్తి చేశారు. సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించనున్నారు. ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ పేరుతో ప్రజాపాలన రంగంలో శిక్షణను ఇచ్చే విద్యా సంస్థ కూడా ఇందులో ఉంది. మహారాష్ట్రలో రాహుల్‌కు చెందిన గ్రూప్ 79 విద్యాసంస్థలను నిర్వహిస్తున్నది. స్పీకర్ నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద సభలు నిర్వహిస్తే బాగుంటుందనే నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. -
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
-
కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
ఏపీ సీఎస్, సీఈసీకి కేంద్ర హోంశాఖ లేఖ నరసరావుపేట: ఓ టీవీ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల సందర్భంగా తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని, దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ న్యాయవాది, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జి.అలెగ్జాండర్ సుధాకర్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వ కార్యదర్శి ఎ.కె.ధావన్ నుంచి విడుదలైన లేఖ మంగళవారం తనకు అందిందన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తి రూ.28 లక్షలు మించి ఖర్చు చేయరాదని భారత ఎన్నికల కమిషన్ పరిమితి విధించిందని, దీనికి విరుద్ధంగా తనంతట తానే స్వయంగా ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల చెప్పిన అంశాన్ని తాను రాష్ట్రపతి, భారత ఎన్నికల కమిషన్ల దృష్టికి జూన్ 21న తీసుకెళ్లానని తెలిపారు. (చదవండీ: ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు) -
మహిళా పార్లమెంటేరియన్ల తొలి మహాసభలు
- ఏపీ స్పీకర్ కోడెలతో ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి భేటీ సాక్షి,హైదరాబాద్: మహిళా పార్లమెంటేరియన్ తొలి మహాసభలు సెప్టెంబర్ మూడో వారంలో విజయవాడలో జరగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా శాసనసభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశాలను పుణే లోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ల సహకారంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్వహించనుంది. సమావేశాలకు చైర్మన్‌గా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా సీఎం చంద్రబాబు, అధ్యక్షురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణమూర్తి వ్యవహరిస్తారు. సమావేశాల నిర్వాహణ పై ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ విశ్వనాథన్ కరాడ్ మంగళవారం ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావుతో సమావేశమై చర్చించారు. ‘మహిళా ప్రోత్సాహం - ప్రజాస్వామ్యం పటిష్టత’ అనే అంశంపై మూడు రోజుల పాటు జరిగే మహాసభ తొలి రోజు ‘మహిళా సాధికారిత- రాజకీయ సవాళ్లు’, వ్యక్తిత్వ నిర్మాణం - భవిష్యత్తు దార్శనికత, గురు శిష్యుల సంబంధాల పెంపు అన్న అంశాలపైన, రెండవ రోజు మహిళల స్థితి - నిర్ణయాత్మకశక్తి, మీకు మీరే సాటి అనే అంశాలపైన ప్రముఖుల ప్రసంగాలుంటాయి. మూడవ రోజు మహి ళా సాధికారిత కోసం పరుగు నిర్వహించనున్నారు. -
గుంటనక్కలకు గులాం
రోడ్డు విస్తరణలో స్పీకర్ స్థలం జోలికి వెళ్లని కార్పొరేషన్ పక్కనే ఉన్న చర్చికి చెందిన.. గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల విస్తరణ చక్రం తిప్పిన టీడీపీ ఎమ్మెల్యే ! గుంటూరులో ఏఈఎల్సీ ఆస్తులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే చర్చి స్థలాలను కారుచౌకగా కొట్టేశారు. మరో ఎమ్మెల్యే తన బినామీ పేరు లీజుకు తీసుకున్నారు. తాజాగా జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి రోడ్డు విస్తరణ సమయంలో తన స్థలాన్ని కాపాడుకునేందుకు చర్చి స్థలాన్ని టార్గెట్ చేశారు. రోడ్డుకు మరోవైపు ఉన్న చర్చికి చెందిన గుంట గ్రౌండ్ స్థలాన్ని తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చారు. సాక్షి ప్రతినిధి, అమరావతి : ‘దీపం ఉన్నప్పుడే దేవుళ్ల ఆస్తులను స్వాహా చేయాలి..’ అన్నట్లుగా ఉంది అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తీరు. గుంటూరులో ఏఈఎల్సీ స్థలాల స్వాహా పర్వం వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. కొందరు ప్రత్యక్షంగా చర్చి ఆస్తులను కొట్టేస్తున్నారు. మరికొందరు తమ స్థలాలను కాపాడుకునేందుకు పరోక్షంగా చర్చి స్థలాలను వినియోగించుకుంటున్నారు. ఏఈఎల్‌సీకి కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. గుంటూరులోని నాజ్ సెంటర్ నుంచి కొత్తపేట వెళ్లే రోడ్డును విస్తరించిన తీరే ఇందుకు నిదర్శనం. రోడ్డు విస్తరణకు ఒకవైపే స్థల సేకరణ.. రోడ్డు విస్తరణ చేసేటప్పుడు సాధారణంగా రెండు వైపులా సమానంగా స్థలం తీసుకుంటారు. కానీ గుంటూరు నాజ్‌సెంటర్ నుంచి కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ వైపు వెళ్లే రోడ్డు విస్తరణ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఈ రోడ్డుకు ఒకవైపు చర్చికి చెందిన గుంట గ్రౌండ్, మరోవైపు స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చెందిన స్థలం ఉన్నాయి. ఈ రోడ్డు విస్తరణ కోసం 22 అడుగులు తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రెండు వైపులా 12 అడుగుల చొప్పున రోడ్డు విస్తరించాల్సి ఉంది. కానీ ఇక్కడే నగరపాలక సంస్థ ‘పచ్చ’పాతం చూపింది. కోడెల స్థలం ఉన్న వైపు కాకుండా... ఏకపక్షంగా చర్చికి చెందిన గుంటగ్రౌండ్ వైపున 22 అడుగుల మేరకు రోడ్డును విస్తరించేసింది. గుంట గ్రౌండ్ లీజు ఎమ్మెల్యే ఆనంద్బాబుకే.. గంట గ్రౌండ్‌ను ఏటా రూ.5 లక్షల లీజుకు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సొంతం చేసుకున్నారు. ఎగ్జిబిషన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే ఏటా రూ.50 లక్షలకుృపైగా ఆర్జిస్తున్నారని క్రైస్తవ సంఘాల పెద్దలు చెబుతున్నాయి. ఎగ్జిబిషన్లకు నేరుగా చర్చి తరఫునే స్థలం ఇస్తే ఆదాయం మొత్తం చర్చికే వస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతా ఎమ్మెల్యే హవా..! ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి గుంట గ్రౌండ్‌కు చెందిన స్థలాన్ని సేకరించే విషయమై చర్చించేందుకు కలెక్టర్ అధ్యక్షతన ఈ ఏడాది మే 12న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు కూడా పాల్గొన్నారు. వేమూరు ఎమ్మెల్యే అయిన ఆనంద్‌బాబుకు ఈ వ్యవహారంతో సంబంధం లేదు. అయినా అధికార పార్టీ తరఫున మధ్యవర్తిత్వం చేయడానికే సమావేశంలో పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది. అదే నెల 18న జరిగిన చర్చి కౌన్సిల్ సమావేశంలో రోడ్డు విస్తరణకు గుంట గ్రౌండ్ స్థలంలో 12 అడుగులు ఇచ్చేందుకు తీర్మానం చేశారు. చర్చి కౌన్సిల్ తీర్మానాన్ని నగరపాలక సంస్థ పట్టించుకోలేదు. ఏకపక్షంగా రోడ్డును గుంట గ్రౌండ్ వైపే 22 అడుగుల మేర విస్తరించింది. కార్పొరేషన్ వైఖరిని వ్యతిరేకిస్తూ చర్చి పెద్దలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. -
ఫిరాయింపులపై నేడు ప్రైవేట్ మెంబర్ బిల్లు
ఫిరాయింపులపై స్వల్పకాలిక చర్చలో విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా టీడీపీలో చేరినప్పుడు ఫిర్యాదుచేసినా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కేంద్రం దృష్టికి తెచ్చారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన సంక్షోభంపై గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘అధికార పార్టీ, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగిన వాగ్యుద్దం మనం ఇప్పటివరకు సభలో చూశాం. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో కూర్చొనే పరిస్థితి వస్తే ఆ పార్టీ సభ్యులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతారు. వారే అధికారంలోకి వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఉభయ సభలు కలిసి ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తెచ్చాయి. అది సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో 2002లో సవరణ చేసుకున్నాం. కానీ వాస్తవానికి ఏం జరుగుతోంది? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయిస్తే.. అనర్హత వేటు వేయాలని దరఖాస్తు చేసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీపక్షానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనే కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇలాగే జరిగింది. టీడీపీలోకి ఫిరాయించిన మా పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..’’ అని పేర్కొన్నారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలని, ఈ ప్రక్రియలో రాష్ట్రపతి ఎన్నికల సంఘం సలహా తీసుకోవచ్చని లా కమిషన్ సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ఫిరాయింపుల నిరోధానికి నేడు ప్రైవేట్ మెంబర్ బిల్లు పార్టీ ఫిరాయింపుల నిరోధంపై రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రైవే ట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటూ ఆర్టికల్ 361( బి) స్థానంలో కొత్త ఆర్టికల్ చేర్చాలని, పదవ షెడ్యూల్ సవరణను బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లును శుక్రవారం నాటి రాజ్యసభ ప్రైవేట్ మెంబర్ కార్యకలాపాలలో చేర్చారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లోని 6 వ పేరాను సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఫిరాయింపులపై పిటిషన్లపై నిర్దిష్ట కాలపరిమితిలో చైర్మన్ లేదా స్పీకర్ చర్యలు తీసుకొనే విధంగా సవరణ ఉండాలని కోరారు. -
స్పీకర్ కోడెల వీడియోను మాకు ఇవ్వండి
ఎన్టీవీకి ఈసీ ఆదేశం హైదరాబాద్: ఎన్నికల్లో ఖర్చు విషయమై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు చేసిన ఫిర్యాదు విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని ఎన్టీవీ చానెల్‌ను ఆదేశించింది. గత నెల 19వ తేదీన ఎన్టీవీ చానెల్ ముఖాముఖి కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ.. 1983 ఎన్నికల్లో తాను రూ. 30వేలు ఖర్చు చేస్తే.. 2014 ఎన్నికలకు వచ్చేసరికి రూ. 11.50 కోట్లు తాను వ్యయం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నట్టు ప్రసారమైంది. దీంతో ఈసీ నిబంధనలకు విరుద్ధంగా అత్యధికంగా ఖర్చుచేసి ఎన్నికల్లో తాను గెలిచినట్టు స్పీకర్ కోడెల పేర్కొన్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని అంబటి ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ గత నెల 19వ తేదీన జరిగి.. 20న ప్రసారమైన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖాముఖి కార్యక్రమం పూర్తి వీడియో దృశ్యాలను తమకు సమర్పించాలని కోరుతూ ఈసీ ఎన్టీవీకి నోటీసులు జారీచేసింది. -
కోడెలపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం:అంబటి
నరసరావుపేట: గత ఎన్నికల్లో తాను రూ.11.50 కోట్లు ఖర్చుచేసినట్లుగా సత్తెనపల్లి శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నందున ఎన్నికల కమిషన్ సుమోటోగా అతనిపై ఒకటీ రెండురోజుల్లో చర్యలు తీసుకోకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో శనివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని వేచిచూస్తున్నాం. మరో రెండు రోజులు చూస్తాం. సుమోటోగా తీసుకొని విచారించకపోతే తామే రాతపూర్వకంగా ఫిర్యాదుచేస్తామన్నారు. అప్పటికీ చర్యలు చేపట్టకపోతే న్యాయపరంగా వైఎస్సార్ సీపీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా రూ.11.50 కోట్లు ఖర్చుపెట్టానన్న తర్వాత కూడా శాసనసభ్యుడిగా, స్పీకర్‌గా పనికి వస్తారా అనే విషయం ప్రజలు గమనించాలన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు
♦ మొన్న ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశా! ♦ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థి వ్యయం ♦ రూ.28 లక్షలు మించరాదు ♦ అఫిడవిట్ ప్రకారం ఆయన స్థిరచరాస్తులు రూ. 5.3 కోట్లే.. ♦ కోడెల వ్యాఖ్యలపై రాజకీయవర్గాల విస్మయం.. ♦ చర్యకు అర్హమైన వ్యాఖ్యలే.. న్యాయవాదుల అభిప్రాయం సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని గుంటూరు జిల్లా సత్తెనపల్లి శాసనసభ్యుడు, ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచ లనం సృష్టించాయి. వీటిపై అటు రాజకీయవర్గాలలోనూ, న్యాయవర్గాలలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. కోడెల ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను మొదట రాజకీయాల్లోకి వచ్చి 1983 ఎన్నికల్లో పోటీ చేసినపుడు రూ. 30 వేలు ఖర్చయ్యింది. ఆ 30 వేలల్లో కూడా గ్రామాలు, ప్రజల నుంచి చందాలు వచ్చాయి. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో రూ.11.50 కోట్లు ఖర్చయ్యింది. ఈ విధంగా డబ్బు ఖర్చు చేయాలంటే అవినీతి చేసే వారు కొంత మంది, ఆస్తులు అమ్మేవారు కొంత మంది, రెండూ కలిపి చేసేవారు కొంతమంది ఉన్నారు. పార్లమెంటు సభ్యుడి దగ్గర తీసుకునే వారు కూడా కొంతమంది ఉన్నారు. రాజకీయాల్లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఆరోగ్యకర పరిణామం కాదు. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులు సంపాదిం చారు కాబట్టి వారి దగ్గర డబ్బులు తీసుకోవటం సరైందేనని ప్రజలు అనుకుంటున్నారు. మా దగ్గర ప్రజలు డబ్బులు తీసుకున్నారు కా బట్టి సంపాదించుకోవాలని వారు (ప్రజాప్రతినిధులు) అనుకుంటున్నారు‘ అని అన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం... శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి వ్యయం పరిమితి ఉంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శాసనసభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.28 లక్షలు, లోక్‌సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయం రూ.70 లక్షలకు మించకూడదు. హర్యాణా, మేఘాలయ తదితర చిన్న రాష్ట్రాల నుంచి పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.22 లక్షలు, ఎంపీ అభ్యర్థికి రూ.54 లక్షలు వ్యయం మించకూడదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాదరావు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేశారు. ఆయన నిజాయితీగా లెక్కలు చెప్పాలని అనుకుంటున్నా అందులో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఏ కోర్టుకూ ఆయన్ను ప్రశ్నించే హక్కు లేకున్నా.. ఆయన నైతిక తప్పిదానికి పాల్పడినట్టే. తానే తప్పుచేశానని చెప్పడం, విలువలను దారుణంగా వంచించడమే. - సీహెచ్.బుచ్చిరాజు, బీజేపీ రాష్ట్ర నేత సుమోటోగా చర్యలు తీసుకోవాలి స్వయానా తన నోటి నుంచే ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానని కోడెల శివప్రసాదరావు చెప్పినందున ఎన్నికల సంఘం సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సంఘం నిర్ణయించిన వాటి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే అది అవినీతి కిందకే వస్తుంది. విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. - ఎన్.తులసిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి.. రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయనడానికి ఇంత కన్నా నిదర్శనం లేదు. ఎన్నికల సంస్కరణలకు ఇది సరైన సమయం. రాజకీయాలు పూర్తిగా డబ్బుమయం అయ్యాయి. కోట్లు ఉన్నవాడు తప్ప నీతి నిజాయితీ కలిగిన సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎన్ని కోట్లు ఖర్చుపెడితే అంత గొప్ప అనే పరిస్థితి ఏర్పడింది. కోడెల శివప్రసాదరావు స్వయంగా పదకొండున్నర కోట్లు ఖర్చు పెట్టానని చెప్పడం నేటి రాజకీయ దురవస్ధకు తార్కాణం. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. - కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ తీవ్రంగా పరిగణించాలి రూ.11.50 కోట్లు ఎన్నికల ఖర్చు చేశారంటే దానిని తీవ్రంగానే పరిగణించాలి. ఓ ఎమ్మెల్యే స్థానానికి అంత మొత్తం ఖర్చు చేశారంటే ఆలోచించాలి. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు ఆయన స్వయంగా చెప్పిన విషయాలే సరిపోతాయి. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేయాలన్నది నిబంధనల్లో స్పష్టంగా ఉంది. దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేసినట్లు కోడెల వ్యాఖ్యలతోనే తేటతెల్లమవుతోంది. ఈ స్థాయిలో ఖర్చు ఎన్నికల నియమావళికి విరుద్ధం. దీనిపై ఎన్నికల సంఘం సుమోటోగా విచారణ ప్రారంభించవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందించి విచారణ జరపాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎవరైనా కోరవచ్చు. - ఎ.సత్యప్రసాద్, సీనియర్ న్యాయవాది ప్రజల్లో చైతన్యం వచ్చినపుడే అడ్డుకట్ట ఓ ప్రజా ప్రతినిధి ఎన్నికల్లో ఖర్చు ఎలా తగ్గించాలో చెప్పడంతో పాటు చేతల్లో చూపించాల్సింది పోయి ఈ విధంగా రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టడం ఎంత వరకు సమంజసమో ఆలోచించాలి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ఇటువంటి ఖర్చులకు అడ్డుకట్టపడుతుంది. ఎన్నికల కమిషన్ సుమోటోగా స్పందించి విచారణ ప్రారంభించవచ్చు. ఫిర్యాదు చేసినా కూడా ఎన్నికల సంఘం స్పందించాల్సిందే. - ఎస్. సత్యంరెడ్డి, సీనియర్ న్యాయవాది బాధ్యతారాహిత్యం... ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం నిబంధనలకు విరుద్ధం. తప్పు చేసి పెపైచ్చు దానిని ఘనంగా చెప్పుకోవడం, అదీ ఓ గౌరవప్రదమైన పదవిలో ఉండి చెప్పుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. దీనిపై ఎన్నికల సంఘం సుమెటోగా చర్యలు చేపట్టవచ్చు. ఫిర్యాదు చేసినా స్పందించి తీరాలి. ఆయనపై పోటీ చేసిన ఓడిపోయిన వ్యక్తి న్యాయపరంగా పోరాటం కూడా చేయవచ్చు. - పి.గంగయ్య నాయుడు, సీనియర్ న్యాయవాది శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి సీనియర్ నాయకుడైన డాక్టర్ కోడెల శివప్రసాదరావు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు ఆయన చెప్పిన మాటలను బట్టి నిరూపితమైంది. ఎన్నికల సంఘం అనుమతికి మించి వ్యయం చేసినట్లు ఆయనే చెప్పినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేయాలి. కోడెల మాట లపై ఎన్నికల సంఘం సుమోటోగా విచారణ జరిపించా లి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి. - డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే, నరసరావుపేట అఫిడవిట్లో అన్ని ఆస్తులు లేవు.. కోడెల శివప్రసాదరావు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన స్థిర చరాస్తుల వివరాలన్నీ ఇచ్చారు. తనపై ఉన్న కేసుల వివరాలతో పాటు చేతిలో ఉన్న నగదు గురించీ వివరించారు. ఆ అఫిడవిట్ ప్రకారం స్థిర చరాస్తులు, చేతిలో ఉన్న నగదు, ఇంకా ఇతర అన్ని రకాల ఆదాయ వివరాలన్నీ కలుపుకున్నా రూ. 5.29 కోట్లు మాత్రమే. అలాంటపుడు ఆయన ఈ రూ. 11.50 కోట్లు ఎలా ఖర్చు చేశారని విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు రావాలి.. ఎన్నికల్లో నిబంధనల ప్రకారం చేయాల్సిన ఖర్చుకు, వాస్తవిక వ్యయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దీన్ని నివారించి సక్రమమైన పద్ధతుల్లో వ్యవస్థ నడవాలంటే ఎన్నికల సంస్కరణలు రావలసిన అవసరముంది. ఎన్నికల వ్యయ పరిమితికి, వాస్తవిక ఖర్చుకు భారీ వ్యత్యాసం ఉంటున్న విషయం బహిరంగ రహస్యం. కోడెల శివప్రసాదరావు చెప్పిన మాట వాస్తవమే. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది. పీవీ నరసింహరావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మాదిరిగా ఎన్నికల సంస్కరణలు తేవలసి ఉంది. పార్లమెంటు దీనిపై దృష్టి సారించాలి. ఎన్నికల సంస్కరణలకు సంబంధించి పలు రకాల నివేదికలు అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులో దీనిపై కూలంకషంగా చర్చించి ఆచరణాత్మక రీతిలో, నిర్దేశిత సమయం నుంచి అమల్లోకి వచ్చేలా ఎన్నికల సంస్కరణల చట్టాన్ని చేయాలి. చర్చించి వదిలేయడం కాకుండా ఫలవంతమైన ముగింపు ఉండాలి. ఎన్నికల సంస్కరణలను అమలు చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక స్థోమత లేకపోయినా సేవాభావం ఉన్న వారికి, మంచివారికి అపుడే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. - మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి -
బాబు సర్కార్ మళ్లీ పరార్
- మరోమారు పలాయనం చిత్తగించిన ప్రభుత్వం - ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌కు ససేమిరా - ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేసినా పట్టించుకోని స్పీకర్ - ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు - సభలో విలువలకు, నిబంధనలకు తిలోదకాలు - ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే తాపత్రయం - ‘డివిజన్’పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న ప్రతిపక్షనేత సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నిబంధనలు లేవు.. విలువలు లేవు.. సంప్రదాయాలు - శాసనసభ ఔన్నత్యం సంగతి సరేసరి... అన్నీ ‘చంద్రా’ర్పణం. సభ హుందాతనం గురించి తరచూ లెక్చర్లిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభా సంప్రదాయాలన్నిటినీ తుంగలో తొక్కారు. విలువలను పాతాళానికి దిగజార్చారు. సభలో తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరపకుండా పలాయనం చిత్తగించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులంతా ముక్తకంఠంతో డివిజన్‌కు డిమాండ్ చేస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా.. సభా మర్యాదను మంటగలుపుతూ మూజువాణితో మమ అనిపించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముగింపు రోజు కూడా చంద్రబాబు మూజువాణి మంత్రాన్ని పఠించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సందర్భంలోనూ అధికారపక్షం ఇలానే వ్యవహరించింది. నిబంధనలకు తిలోదకాలిచ్చింది. విలువలకు పాతరేసింది. బుధవారం మూజువాణి ఓటుతో ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తున్నపుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘కౌల్ అండ్ షక్దర్’లోని నిబంధనలను సభకు వివరించే ప్రయత్నం చేస్తుంటే మైక్ కట్ చేశారు. ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ప్రజలంతా చూస్తున్నారన్న బెరుకు లేకుండా నిస్సిగ్గుగా సభా సంప్రదాయాలను ఇలా తుంగలో తొక్కడం, ప్రతిపక్షం గొంతునొక్కడం మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకోవడం కోసమే ఓటింగ్ జరక్కుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నదని విమర్శకులంటున్నారు. ఓటింగ్ జరక్కుండా కాపాడుకునేందుకు స్పీకర్ వ్యవస్థనూ రాష్ర్ట ప్రభుత్వం దుర్వినియోగపరచడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షనేత సహా సభ్యులంతా పట్టుబట్టినా డివిజన్‌కు అనుమతించకపోవడం నిబంధనలకు విరుద్ధమే కాదు అన్యాయం కూడా అని సీనియర్ పార్లమెంటేరియన్లు పేర్కొంటున్నారు. ప్రతిపక్షనేత లేచి నిలబడి నిబంధనలను చదివి వినిపిస్తుంటే పట్టించుకోకుండా పదేపదే మైక్ కట్ చేయడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఈ స్థాయిలో ప్రతిపక్షం గొంతు నొక్కిన సందర్భాలు మునుపెన్నడూ కనీ విని ఎరుగమని విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ ఆఫ్ ఓట్ ను కోరడమనేది రాజ్యాంగపరంగా ప్రతిపక్ష సభ్యులకు లభించిన హక్కు. అయితే ఓటింగ్ జరిగితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి బైటపడిపోతుంది కాబట్టి వారు అనర్హులయిపోతారు కాబట్టి వారిని కాపాడేందుకే ప్రభుత్వం ఇలా నిస్సిగ్గుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనేది నిర్వివాదాంశమని పరిశీలకులంటున్నారు. ఇక సభ్యుల బలాబలాలను ప్రకటించేటపుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది అని స్పీకర్ ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది, సస్పెన్షన్‌కు గురైన ఒక ఎమ్మెల్యేని తీసివేస్తే వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 56 మాత్రమే. కానీ స్పీకర్ అత్యంత జాగ్రత్తగా 67 అని ప్రస్తావించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సాంకేతికంగా కూడా ఎలాంటి అవకాశం లేకుండా చేయడానికే స్పీకర్ అలా ప్రకటించారని ప్రతిపక్షసభ్యులు విమర్శిస్తున్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారి చేత రాజీనామా చేయించడం, లేదంటే అనర్హత వేటు వేయడం, తిరిగి ప్రజాభిప్రాయం కోరేందుకు ఆ స్థానాల్లో ఎన్నికలకు సిద్ధపడాలి. కానీ అధికార పక్షం ఈ మూడింటికీ సిద్ధంగా లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ను బహిష్కరించారు. హామీలు నెరవేర్చకుండా అవినీతి వ్యవహారాలలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో పరువు పోగొట్టుకుందని, అందుకే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడానికి గానీ, అనర్హత వేటు వేయడానికి గానీ చంద్ర బాబు వెనకాడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. స్పీకర్ డివిజన్‌కు అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలకు కాలరాసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు గానీ నైతికంగా ఓటమిపాలయ్యినట్లేనని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు. ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు పార్లమెంటరీ వ్యవహారాల్లో సహజ న్యాయం పరిరక్షణకే ప్రాధాన్యత ఉంటుంది. శాసన వ్యవస్థల అధిపతులు కూడా పరిస్థితులను బట్టి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తారు. సభలో ఏ అంశం మీదైనా మూజువాణి ఓటును ఎవరైనా ప్రశ్నిస్తే.. తప్పకుండా ‘డివిజన్ ఆఫ్ ఓట్’కు వెళ్లాల్సి ఉంటుందని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుసరిస్తున్న పద్దతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలే కాదు అది ఓ సాంప్రదాయంగా కూడా పాటిస్తూ వస్తున్నారు. కౌల్ అండ్ షక్దర్ 917వ పేజీలో ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే కాకుండా, సభ ఆమోదం కోసం వచ్చే ఏ అంశంలో అయినా.. మూజువాణి ఓటును ఏ ఒక్క సభ్యుడు ప్రశ్నించినా.. సభాపతి స్థానంలో ఉన్న వారు మరింత స్పష్టత కోసం ‘డివిజన్’కు వెళ్లాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. ఎవరూ ప్రశ్నించకపోతే.. మూజువాణి ఓటుతో సరిపెట్టవచ్చు. కానీ రెండు సందర్భాలలో స్పీకర్ హడావిడిగా మూజువాణి ఓటుతో సరిపెట్టేశారు. ‘డివిజన్’కు అవకాశమివ్వలేదు. -
స్పీకర్‌కు వైఎస్సార్ సీఎల్పీ లేఖలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు శనివారం రెండు లేఖలు రాసింది. ఓ లేఖలో ద్రవ్య వినిమయ అంశం, మరో లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యేల పేర్ల జాబితాను పొందుపరిచారు. ఈ లేఖలను పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు అందించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. -
రోజా అంశంపై సోమవారం నిర్ణయం: స్పీకర్ కోడెల
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై కోర్టు జారీ చేసిన ఆదేశాల అంశంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా అంశంపై స్పీకర్ కోడెల స్పందించారు. కోర్టు ఉత్తర్వులపై శాసనసభే నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులు అసెంబ్లీకి అందాయని చెప్పారు. సభ్యులందరికీ కోర్టు ఉత్తర్వుల కాపీలను అందిస్తామన్నారు. సభ తీర్మానం ఆమోదం మేరకే శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేశామని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
'స్పీకర్ తీరు అత్యంత దురదృష్టకరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై వైఎస్ఆర్ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి నోటీసులు అందజేశారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. కోడెల స్పీకర్ అయినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా ఉండాల్సింది పోయి టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. 'కోడెల సభాపతి.. అన్నివిధాలా గౌరవంతో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా అయ్యేందుకు సహకరించారు. సభాపతి పదవి మీద గౌరవంతో మేమంతా సహకరించాం. కానీ ఆయన టీడీపీ సభ్యుడిగా అనేక సందర్భాల్లో వ్యవహరించారు. గత శాసన సభ సమావేశాల్లో ఎమ్మెల్యే రోజా మీద ఎలాంటి చర్య తీసుకున్నారో అందరూ చూశారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక తప్పుడు రూల్ కింద రోజా సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. ఆ రూల్ కింద సంవత్సర కాలం పాటు ఒక సభ్యురాలిని సస్పెండ్ చేసే అధికారం లేదని మేం స్పష్టంగా చెప్పాం' అని సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. -
'ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి'
-
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్, డీజీపీలకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శన అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. పెరిగిన భక్తుల రద్దీ తిరుమలలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటలు, సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. కాగా, నేడు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించనున్నారు. -
రేపటి నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. అలాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోని వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మంత్రులతోపాటు నాయకులు అడపాదడపా ప్రకటిస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హోదాపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ పార్టీ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై వారు ఈ సందర్భంగా చర్చించారని సమాచారం. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ రోజు సాయంత్రం ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలపై అధినేత...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దిశానిర్దేశం చేయనున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ కోడెల
తిరుమల: తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శనంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. సభాపతికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ ఏడుకొండల వాడిని కోరుకున్నట్లు కోడెల తెలిపారు. -
ఏపీ శాసనసభ బీఏసీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ వ్యవహారాల సమావేశం స్పీకర్ కోడెల శివప్రసాద రావు అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీడీపీ తరుపున సీఎం చంద్రబాబు, కాల్వ శ్రీనివాసులు ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్‌రెడ్డి... బీజేపీ తరఫున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాలు 23వ తేదీతో ముగియనున్నాయి. -
వంగవీటి రంగా హత్య, ఎన్టీఆర్ మరణంపై మాట్లాడగలరా?
హైదరాబాద్: టిడిపి నేతలు కాంగ్రెస్ నేత వంగవీటి మోహన రంగా హత్య, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మరణంపై మాట్లాడగలరా? అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రాజన్నదొర, నారాయణస్వామి, సంజీవయ్య ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడుతూ పరిటాల రవి హత్య గురించి ఇప్పుడు మాట్లాడమేంటి? అని అడిగారు. ఆ కేసులో నిందితులుగా ఆరోపణలకు గురైనవారు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వవ్యవహార శైలిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా స్వామ్యామా? నియంతృత్వమా? అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఎలా? అని అడిగారు. సభలో ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతామన్నప్పుడు స్పీకర్ కచ్చితంగా మైక్ ఇవ్వాలని వారన్నారు. కాని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి వాకౌట్ చేస్తామన్నా స్పీకర్ ఆ అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అధికార పక్షం దారుణంగా మాట్లాడుతున్నా స్పీకర్ వారిని నిలువరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 నెలల్లో జరిగిన హత్యల గురించి మాట్లాడమంటే అధికారపక్షం చర్చను తప్పుదోవ పట్టించిందన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ వారు ప్రశ్నిస్తామనే భయంతో ప్రతిపక్షంపై దాడికి దిగారని మండిపడ్డారు. రుణమాఫీపై నిలదీస్తారనే వారి భయం అన్నారు. రైతులను మోసం చేశారని, ఇప్పడు బ్యాంక్‌లను నిందించి తప్పుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. నిరుద్యోగులకు మేనిఫెస్టోలో రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు శాసనసభలో వెయ్యి రూపాయలు మాత్రమే ప్రకటించారని వివరించారు. స్పీకర్ అసెంబ్లీలో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. తమకు ఉపప్రశ్నలు వేయడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. అధికారపక్షానికి పేరు లేకపోయినా అవకాశాలు ఇస్తున్నారన్నారు. ఇప్పటికైనా చర్చ అర్ధవంతం జరిగేలా స్పీకర్ వ్యవహరించాలని కోరారు. స్పీకర్ టీడీపీ నేతగా పని చేయవద్దని కోరారు. స్పీకర్‌ను ముషారఫ్, రౌడీ అని నిందించిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదే అని అన్నారు. గతంలో స్పీకర్లను దారుణంగా అవమానించిన చరిత్ర టిడిపి నేతలదని రాజన్నదొర, నారాయణస్వామి, సంజీవయ్య విమర్శించారు. -
''స్పీకర్ వ్యవహరించిన తీరు భాదాకరం''