కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కాకుండా మినహాయింపు చేస్తూ రాష్ట్ర హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్(పీపీఆర్) కోర్టుకు బుధవారం అసెంబ్లీ స్పీకర్ కోడెల హాజరు కావాల్సిందిగా, గతంలో ఆయనకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 2016 జూన్ 19 రోజున ఒక టీవీ ఛానల్ ఇంటర్వూ్యలో శివప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో 11 కోట్ల 50 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ట్లు చెప్పారు.
ఇది ఎన్నికల సంఘం నిర్ణయించిన ఖర్చు కంటే 40 రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువని పేర్కొంటూ కరీంనగర్‌కి చెందిన సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆయనపై కోర్టులో కేసు వేశారు. ఫిర్యాదు విచారణ నిమిత్తం బుధవారం శివప్రసాద్ కోర్టుకు హాజరు కావల్సి ఉండగా దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు హాజరును నిలుపుదల చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసిందని, వాటి ప్రతిని ఆయ న తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టులో దాఖలు చేశారు. కేసు విచారణను ఆగస్టు 22కి జడ్జి వాయిదా వేశారు.
ఏపీ స్పీకర్‌కు హైకోర్టు ఉత్తర్వులు
Published Thu, Jun 22 2017 3:34 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement