వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై కోర్టు జారీ చేసిన ఆదేశాల అంశంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు వెల్లడించారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై కోర్టు జారీ చేసిన ఆదేశాల అంశంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా అంశంపై స్పీకర్ కోడెల స్పందించారు. కోర్టు ఉత్తర్వులపై శాసనసభే నిర్ణయం తీసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులు అసెంబ్లీకి అందాయని చెప్పారు. సభ్యులందరికీ కోర్టు ఉత్తర్వుల కాపీలను అందిస్తామన్నారు. సభ తీర్మానం ఆమోదం మేరకే శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేశామని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు.