సాక్షి, హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసుపై శుక్రవారం విచారణ జరిగింది. అగ్రిగోల్డ్‌కు చెందిన మొత్తం ఆస్తులను 4వేల కోట్లరూపాయలకు తీసుకుంటామని జీఎస్‌ఎల్ గ్రూప్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా 4వేల కోట్ల రూపాయలు చెల్లించటానికి నాలుగేళ్ల గడువు ఇవ్వాలని జీఎస్‌ఎల్ గ్రూపు కోరింది. దీనిపై పిటిషనర్, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వేళ ఆస్తులను కొనుగోలు చేస్తే మొదట 500కోట్లరూపాయలు డిపాజిట్ చేయాలని వారు కోరారు. ఏడాదిలోపు మొత్తం కోనుగోలు ప్రక్రియను జీఎస్‌ఎల్ గ్రూపు పూర్తి చేయాలన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలకు ఏవైనా అభ్యంతరాలుంటే తెలపాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment