ఐదువేల కోట్లు ఎలా సరిపోతాయి?
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
విజయవాడ: రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీకి రూ.1.2 లక్షల కోట్లు అవసరంకాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు సాధికార సంస్థ పేరుతో ఐదువేల కోట్లు ఇస్తే ఎలా సరిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. రూ. 1.2 లక్షల కోట్ల అప్పుపై రూ. 25 వేల కోట్లు వడ్డీ ఉందని.. కనీసం చంద్రబాబు ఇచ్చిన రూ. 5 వేల కోట్లు వడ్డీకి కూడా సరిపోదని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే రుణమాఫీ హామీ నుంచి పూర్తిగా తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఆరు నెలలు కాలక్షేపం చేశారని విమర్శించారు.
విజయవాడలో శనివారం వైఎస్సార్‌సీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజులు రాగా సమీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు హాజరయ్యారు. సమీక్ష అనంతరం పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబుపై మండిపడ్డారు.
గమనిక
‘నేటి నుంచి జిల్లాల్లో వైసీపీ నేతల పర్యటన’ శీర్షికతో శనివారం నాడు ప్రచురితమైన వార్తలో పొరపాటున సాగి ప్రసాదరాజు ఫొటో బదులుగా వేరే ఫొటో ప్రచురితమైంది. గమనించగలరు.