దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి | Dalva give clarity | Sakshi
Sakshi News home page

దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి

Published Thu, Dec 4 2014 1:46 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి - Sakshi

దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి

వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
 
పామర్రు : దాళ్వా సాగుపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని దక్షిణ కృష్ణా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాళ్వా సాగుపై ఆధారపడి అనేక మండలాలు ఉన్నాయని, వాటి కి సకాలంలో సాగునీరు  ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సాగుకు నీరివ్వని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమించేందుకు వైఎస్సార్‌సీపీ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. రైతులకు తగు న్యాయం జరిగేంతవరకూ వారి పక్షాన పోరాడతామన్నారు.

హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు...

ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందని సారథి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తూ వ్యవసాయ రుణాలు కాదు.. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ రుణాల్లో ట్రాక్టరు, మోటారు తదితరాల కోసం తీసుకున్న రుణాలు కూడా ఉంటాయని, వాటినీ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెలలో చేస్తాం, వచ్చే నెలలో చేస్తాం అంటూ ఆరు నెలల పాటు కాలం గడుపుతోందన్నారు. ఈ నెల ఐదున వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల నాలుగున రైతు రుణాల విధి విధానాలపై చర్యలు తీసుకుంటామని మాయ మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ చేపట్టిన కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకే ఈ విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ప్రజలు దీనిని అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. రైతు సాధికారత ద్వారా ఇచ్చే 20 శాతం నిధులు రైతు రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు..

పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలను చైతన్యవంతుల్ని చేసి ధర్నాలో పాల్గొనేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్‌లకు వచ్చిన జాబితాలను చూసి రైతులు భయాందోళనలు చెందుతున్నారన్నారు. ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవనే నెపంతో రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పేద వర్గాలకు ఇవ్వాల్సిన పింఛన్లను అన్యాయంగా తొలగించారని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల  పింఛన్లను, 23 లక్షల రేషన్ కార్డులను తొలగించి వారి ఉసురుపోసుకుందన్నారు. రాజకీయ కక్షలతో ఈ విధంగా తొలగించటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నష్టపోయిన వారి తరఫున తాము పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరేవరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేసి వారి తరఫున పోరాడతామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చే విధంగా పార్టీ కృషి చేస్తుందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినవారు, నిధులు మంజూరు కాని ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ ధర్నాకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానంపై ఈ నెల ఐదో తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు అందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మందా శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ మొబిన్, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement