Dalva cultivation
-
దాళ్వాపై స్పష్టత ఇవ్వాలి
వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి పామర్రు : దాళ్వా సాగుపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని దక్షిణ కృష్ణా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాళ్వా సాగుపై ఆధారపడి అనేక మండలాలు ఉన్నాయని, వాటి కి సకాలంలో సాగునీరు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సాగుకు నీరివ్వని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమించేందుకు వైఎస్సార్సీపీ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. రైతులకు తగు న్యాయం జరిగేంతవరకూ వారి పక్షాన పోరాడతామన్నారు. హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు... ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతోందని సారథి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిఫెస్టోలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మారుస్తూ వ్యవసాయ రుణాలు కాదు.. పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయ రుణాల్లో ట్రాక్టరు, మోటారు తదితరాల కోసం తీసుకున్న రుణాలు కూడా ఉంటాయని, వాటినీ మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెలలో చేస్తాం, వచ్చే నెలలో చేస్తాం అంటూ ఆరు నెలల పాటు కాలం గడుపుతోందన్నారు. ఈ నెల ఐదున వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల నాలుగున రైతు రుణాల విధి విధానాలపై చర్యలు తీసుకుంటామని మాయ మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ చేపట్టిన కార్యక్రమాలను నిర్వీర్యం చేసేందుకే ఈ విధంగా మాట్లాడుతోందని విమర్శించారు. ప్రజలు దీనిని అర్థం చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. రైతు సాధికారత ద్వారా ఇచ్చే 20 శాతం నిధులు రైతు రుణాల వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. పామర్రు ఎమ్మెల్యే, అసెంబ్లీలో వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఉద్యమ ప్రాధాన్యతను గుర్తించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలను చైతన్యవంతుల్ని చేసి ధర్నాలో పాల్గొనేందుకు కృషి చేయాలన్నారు. బ్యాంక్‌లకు వచ్చిన జాబితాలను చూసి రైతులు భయాందోళనలు చెందుతున్నారన్నారు. ఆధార్, పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవనే నెపంతో రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పేద వర్గాలకు ఇవ్వాల్సిన పింఛన్లను అన్యాయంగా తొలగించారని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్రంలో 10 లక్షల పింఛన్లను, 23 లక్షల రేషన్ కార్డులను తొలగించి వారి ఉసురుపోసుకుందన్నారు. రాజకీయ కక్షలతో ఈ విధంగా తొలగించటం ఆటవిక చర్యగా అభివర్ణించారు. అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నష్టపోయిన వారి తరఫున తాము పోరాడుతున్నామన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేరేవరకు ప్రజలను చైతన్యవంతుల్ని చేసి వారి తరఫున పోరాడతామన్నారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలను నెరవేర్చే విధంగా పార్టీ కృషి చేస్తుందన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినవారు, నిధులు మంజూరు కాని ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ ధర్నాకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానంపై ఈ నెల ఐదో తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు అందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మందా శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ మొబిన్, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి -
దాళ్వాకు నీటి ఎద్దడి ఉండదు
తాడేపల్లిగూడెం : దాళ్వా పంట సాగుకు నీటి ఎద్దడి ఉండదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు భరోసా ఇచ్చారు. జిల్లాలో సాగునీటి పరిస్థితులపై తాడేపల్లిగూడెంలో మంగళవారం ఆయన ఇరిగేషన్ , రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి తరువాత సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పంటకు కావలసిన నీటి వసతుల ఏర్పాట్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంటకునీటి ఎద్దడి లేకుండా చెరువులను వారం రోజులలోగా నింపుకోవాలని కోరారు. డ్రెయిన్ల నీరు వృథా కాకుండా అడ్డుకట్టలు వేసేందుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో దాళ్వా ఆకుమడులు సిద్ధం చేసుకోవాలని రైతులను కోరారు. వ్యవసాయాధికారులు గ్రామాలలో నారు మడు ల పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట్ల రెగ్యులేటర్లు, షట్టర్లు, నీరు వృధా కాకుండా కంట్రోలింగ్ పాయింట్లు సిద్దం చేసుకోవాలని, లస్కర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసమాధవ, ఈఈ శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, డ్రెయిన్స్ డీఈ సాయిబాబా, ఏడీఏ ఎన్.శ్రీనివాసరావు, తహసిల్దార్ పాశం నాగమణి, ఎంపీడీవోలు జీవీకే మల్లికార్జునరావు, దోసిరెడ్డి పాల్గొన్నారు. -
దాళ్వా ఉన్నట్టా? లేనట్టా?
టీడీపీ నేతలు, అధికారుల దాగుడుమూతలు నీరివ్వలేమంటున్న నీటిపారుదలశాఖ ఎస్ఈ స్పష్టత లేక రైతుల్లో ఆందోళన టీడీపీ నేతలు, అధికారులు మధ్య సమన్వయ లోపంతో చేస్తున్న ప్రకటనలతో దాళ్వా సాగుపై రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రబీలో దాళ్వాకు సాగునీరందిస్తామని మంత్రులు దేవినేని, కామినేని , టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు హామీలిస్తుండగా... నీటిపారుదల శాఖ ఎస్ఈ రామకృష్ణ మాత్రం నీటి విడుదలకు అసలు అవకాశమే లేదంటున్నారు. దాళ్వాపై ఇంతవరకూ స్పష్టమైన ప్రకనటన చేయకపోవడ ంతో జిల్లా రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. చల్లపల్లి : ఈ ఏడాది ఖరీప్సాగు నెలరోజుల ఆలస్యంగా ప్రారంభమయిన విషయం విదితమే. దీనికితోడు దోమపోటు వరిపొలాలను చుట్టేసింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో దాళ్వాకు అనుమతిస్తే దానిద్వారానైనా నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశపడుతున్నారు. మంత్రులు, ముఖ్య అధికారులు పొంతనలేని ప్రకటనలు చేస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాకు చెందిన మంత్రులు నీరిస్తామని చెబుతున్నా... ఇప్పటికే తన పరిధిలో 54 టీఎంసీల సాగునీటి కొరత ఉందని, దాళ్వాకు నీరు విడదల చేసే అవకాశం లేదని నీటిపారుదలశాఖ ఎస్ఈ రామకృష్ణ శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే జిల్లాలో పలు ప్రాంతాల్లో సార్వా వరికోతలు ప్రారంభమయ్యాయి. దాళ్వా అదునుకు విత్తనాలు జల్లుకోవడం, వరినారు పోసుకోవడం చేయాలి. అయితే పరిస్థితులను గమనిస్తుంటే ఈ ఏడాది జిల్లాలో చాలా తక్కువ ప్రాంతంలో మాత్రమే దాళ్వాకు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది జిల్లాలో 2.80లక్షల ఎకరాల్లో దాళ్వాసాగుకు అనుమతిచ్చారు. ఈ ఏడాది ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టంగా తేలేవరకు రైతులకు ఆందోళన తప్పదు. దాళ్వా రైతును ఆదుకోవాలి... ఈ ఏడాది ఖరీప్సాగు ఆలస్యం కావడం, వరికి చీడపీడలు తీవ్రస్ధాయిలో ఆశించడం, దోమపోటు ఎక్కువ కావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దిగుబడులు తీవ్రస్ధాయిలో తగ్గిపోతాయని రైతులు చెబుతున్నారు. గత ఏడాది మూడుసార్లు తుపాన్లు, వాయుగుండాల గాలులకు జిల్లాలో భారీగా దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు చాలానష్టపోయారు. గతంలో దాళ్వా సాగుచేసిన రైతులు ఖరీప్‌లో జరిగిన నష్టాన్ని పూడ్చుకున్నారు. దాళ్వాగా వరి లేదంటే మొక్కజొన్న వేసేందుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది జిల్లాలో 90వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేసినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అనధికారింగా మరో పదివేల ఎకరాలు ఎక్కువగానే ఉంటుంది. మొక్కజొన్న సాగుచేసిన రైతులు ఎకరాకు రూ.20వేల నుంచి 35వేల వరకూ లాభాలు గడించారు. ఈ దృష్ట్యా ఈ ఏడాది దాళ్వాకు అనుమతివ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.