మూడేళ్ల పాలనలో బడుగులకు ఏం చేశారు?
శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలు తన మూడేళ్ల పాలనలో ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతిని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు.
పూలే జయంతిని ఘనంగా నిర్వహించామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే చాలదని, అసలు బలహీన, బడుగు వర్గాల సంక్షే మానికి చేసిందేమిటో చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో బలహీనవర్గాలకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ అనుకునే వాళ్లమని, ఎన్నికల తరువాత అది కాస్తా ‘బాబు గారి క్లాస్’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.