White Paper Release
-
చంద్రబాబు శ్వేత పత్రంకు ఆదిమూలపు సురేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
నేడు ప్రాజెక్టులపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీ శ్వేతపత్రం విడుదల, నీటిపారుదల రంగంపై ప్రజెంటేషన్ శనివారానికి వాయిదా పడ్డాయి. వీటిపై శాసనసభలో శుక్రవారమే చర్చ జరగాల్సి ఉన్నా ఇతర అంశాలపై చర్చతో జాప్యమవడం, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ సభ్యు ల నిరసనతో చాలా సేపు గందరగోళం నెలకొంది. నీటిపారుదల అంశం చాలా కీలకం కావడంతో.. ఎక్కువ మంది సభ్యులు చర్చలో పాల్గొనేందుకు వీ లుగా వాయిదా వేయాలని అధికార పక్షం కోరడం.. దీనికి ఎంఐఎం, సీపీఐ మద్దతివ్వడంతో స్పీకర్ శ నివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కి.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో శాసనసభలో కులగణనపై తీర్మానం ఆమోదం పొందాక స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తేనీటి విరామం ప్రకటించారు. తిరిగి సభ సాయంత్రం 6 గంటలకు సమావేశమైంది. తొలుత ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య లేచి.. శ్వేతపత్రంపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సభను శనివారానికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. దీనితో వాయిదా వద్దని, వెంటనే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ సభ్యులు లేచి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండకు హెలికాప్టర్లో వెళతారు. ఐదు నిమిషాల్లో రాగల సభకు రాకపోవడం ఏమిటంటూ ఘాటు విమర్శలు చేశారు. దీనితో బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి తదితరులు నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. వాయిదాపై చర్చ తర్వాత బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్వేతపత్రంపై చర్చించడానికి గంటల తరబడి వేచి ఉన్నాం. రాత్రి 11 గంటల వరకు కూర్చోవడానికి సిద్ధం. శనివారం పార్టీ సమావేశాలకు వెళ్లాల్సి ఉంది. మీరు ఎజెండాలో పెట్టి ఎందుకు చర్చ చేపట్టడం లేదు. వెంటనే చర్చ మొదలుపెట్టండి..’’ అని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకుంటూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్ నిర్ణయిస్తారని చెప్పారు. సభ వాయిదాకు అభ్యంతరం లేదని ఎంఐఎం, సీపీఐ సభ్యులు తెలిపారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్టులపై స్పల్పకాలిక చర్చ శుక్రవారం ఉంటుందని, సమావేశాలు అదేరోజు ముగుస్తాయని బీఏసీలో నిర్ణయించారు. మధ్యాహ్నం కలసినప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు కూడా స్పల్పకాలిక చర్చ ఉంటుందన్నారు. కానీ ఇలా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా చర్చ లేకుండా వాయిదా వేస్తామనడం సరికాదు. ఎంతరాత్రయినా చర్చకు మేం సిద్ధం. ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తాం. ఇష్టానుసారం నిర్వహిస్తామనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. బీఏసీలో నిర్ణయించని ఇతర అంశాలను స్పీకర్ అనుమతితో చర్చిద్దామనుకున్నామని చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమని, అన్ని పారీ్టల ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనేందుకు వీలుగా శనివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు నిర్వహిద్దామని, ప్రతిపక్షం సహకరించాలని కోరారు. కాగా.. కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. సభను శనివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. మీరంటే.. మీరు.. క్షమాపణల కోసం డిమాండ్ సభలో గందరగోళం నెలకొన్న తరుణంలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుని.. శ్వేతపత్రంపై స్పల్పకాలిక చర్చకు సంబంధించి అన్నిపక్షాల సలహాలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు అవకాశం ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేత గురించి మంత్రి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా స్పీకర్ రికార్డుల నుంచి తొలగించాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘నల్లగొండ సభలో ప్రతిపక్ష నేత సీఎంను, నన్ను దున్నపోతులంటూ వ్యాఖ్యానించారు. ఆయన సభకు వచ్చి క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ప్రతిస్పందిస్తూ.. ‘‘గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నాటి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కాల్చేయాలి, ఉరితీయాలి అని మాట్లాడలేదా? బాధ్యతయుత పదవిలో ఉన్నందున సభలో అలా మాట్లాడవద్దు’’ అని కౌంటర్ ఇచ్చారు. -
టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల..
-
టీటీడీ పాలకమండలి భేటీ: కీలక నిర్ణయాలు
సాక్షి, తిరుమల: డిసెంబరు 27 నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం పాలక మండలి సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆస్తులపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచే ఉంచాలని భక్తులు కోరారని, ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసి దేశంలోని ప్రధాన పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పది రోజులపాటు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. (చదవండి: శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం) ‘‘భక్తులు విరాళంగా ఇచ్చిన ఆస్తులను అమ్మడానికి వీలు లేకుండా శ్వేత పత్రం విడుదల చేశాం. తిరుమలలోని ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారానికి బంగారు తాపడంపై చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ వారికి యూనిఫాం అలవెన్స్ గా రెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. కాలు నడక భక్తుల కోసం షెల్టర్ కూడా ఆధునీకరణ పనులు చేపడుతున్నాం. గాలి గోపురాల మరమ్మత్తులకు నిధుల కేటాయించాం. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటంలో ప్లాస్టిక్‌ను నియంత్రించాం. తిరుమలను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దుతాం. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు 100 నుండి 150 బస్సులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గ్రీన్‌పవర్ వాడేందుకు పాలక మండలి సభ్యులు తీర్మానించారు. (చదవండి: భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్) తిరుచానూరు అమ్మవారి ఆలయంలో సూర్యప్రభ వాహనానికి 11.76 లక్షల బంగారు తాపడం కోసం నిధులు కేటాయించాం. సాధారణ భక్తులకు కేటాయించే కాటేజీల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నాం. ధర్మ రథాలు ధర్మ ప్రచార పరిషత్ కోసం తిరిగి ప్రారంభిస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో పేదల వివాహం కోసం కల్యాణ మండపాల్లో కల్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభిస్తాం. బాల మందిరాల్లో అనాధ పిల్లల సౌకర్యార్థం పది కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. చెన్నై వలందురు పేటలో నాలుగు ఎకరాల్లో రూ.10 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నాం. జాతీయ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనే టీటీడీ డిపాజిట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని’’ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. -
ఎప్పటికప్పుడు సమాచారం పంచుకున్నాం
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌పై సరైన సమయంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయలేదన్న నేరారోపణలు ఎదుర్కొంటున్న చైనా.. తాజాగా వైరస్‌కు సంబంధించి శ్వేత పత్రాన్ని ఆదివారం విడుదల చేసింది. వైరస్ విషయాన్ని దాచిపెట్టలేదని, ఇందులో తమ తప్పు, పొరపాటు ఏమీ లేదని సమర్థించుకుంటూ సమగ్ర వివరణ ఇచ్చింది. ఈ కరోనా వైరస్‌ను తొలిసారి వూహాన్లో గత సంవత్సరం డిసెంబర్ 27న ఒక ఆసుపత్రిలో వైరల్ న్యూమోనియాగా గుర్తించామని వెల్లడించింది. మనిషి నుంచి మనిషికి సోకుతుందన్న విషయాన్ని జనవరి 19న నిర్ధారించామన్నారు. ఆ వెంటనే వైరస్ వ్యాప్తి నిరో«ధ చర్యలు ప్రారంభించామంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రపంచ దేశాధి నేతలు కరోనా మారణకాండకు, ఆర్థిక అస్తవ్యస్తతకు చైనానే కారణమని ఆరోపణలు చేస్తుండటం తెలిసిందే. జనవరి 19కి ముందు, ఆ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకుతుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదని వైరస్ వ్యాప్తిపై చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన అత్యున్నత శాస్త్రవేత్తల కమిటీ సభ్యుడు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు వాంగ్ గ్వాంగ్ఫా పేర్కొన్నారు. వూహాన్‌కు తాము వెళ్లినప్పటికే.. అక్కడ జ్వర పీడితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. వైరస్‌ను తొలుత గుర్తించిన మాంసాహార మార్కెట్‌కు వెళ్లని వారికి కూడా ఈ వ్యాధి సోకినట్లు గుర్తించామన్నారు. జనవరి 14 నాటికి వూహాన్ నగరం ఉన్న హ్యుబయి రాష్ట్రం మొత్తం వైరస్ వ్యాప్తి ముప్పు ఉన్నట్లు గుర్తించిన ఎన్‌హెచ్‌సీ.. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. నిర్ధారించలేని కారణంతో న్యూమోనియా రావడాన్ని గుర్తించిన తక్షణమే అందుకు కారణాలను అన్వేషించాలని పరిశోధకులను ప్రభుత్వం ఆదేశించిందని వివరించారు. ముప్పును గుర్తించిన చైనా వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థను, అమెరికా సహా ఇతర దేశాలను అప్రమత్తం చేసిందన్నారు. అనంతరం, ఈ కొత్త కరోనా వైరస్ జన్యుక్రమాన్ని పరిశోధించి, ఆ వివరాలను కూడా డబ్ల్యూహెచ్ఓ, ప్రపంచ దేశాలతో పంచుకుందన్నారు. హ్యుబయితో పాటు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో దేశంలో కూడా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు ప్రారంభించామని తెలిపారు. జనవరి 3 నుంచే వైరస్ సంబంధించిన వివరాలను డబ్ల్యూహెచ్ఓతో పాటు ఇతర దేశాలతో పంచుకున్నామన్నారు. -
కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కేంద్రంపై నిందలు మోపడం మాను కోవాలని హితవు పలికారు. శాసనసభలో సీఎం కేసీఆర్ తన మాటలతో శాసనసభను, ప్రజలను తప్పు దారి పట్టించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఖర్చుపెట్టలేని దీన స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. అందరి ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకువస్తే రాష్ట్రం ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం వల్లే భువనగిరిలో ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) ఏర్పాటయిందన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కేంద్రంపై నిందలు మోపడం మానుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు, సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అనతికాలంలోనే ఇచ్చిన విష యం సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, సీఎంలకు అపాయింట్మెంట్లు ఇస్తుంటే...రాష్ట్ర సీఎం మంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు, ఇతర పార్టీ నాయకులకు ఎన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చారో చెప్పాలన్నారు. గత ఐదు సంవత్సరాల్లో మోడీ ఎన్ని నిధులు ఇచ్చారో చర్చకు రావాలని సవాల్ చేశారు. పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు దాదాపు 16 వేల కోట్లు ఇస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక లక్ష 15 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన చందంగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వ్యవహారం ఉందని పేర్కొన్నారు. -
ఏపీ ప్రజలకు ఎందుకీ ఖర్మ..?
సాక్షి, విశాఖపట్నం: మే నెలలో పోలవరం నీరు ఇస్తామని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ సమయంలో గోదావరిలో నీళ్లు ఉండవన్న సంగతి తెలియదా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. గోదావరి నుంచి గ్రావీటితో నీళ్లు రావని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. లక్షా 45వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ప్రారంభమని ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమేనని అన్నారు. ఇప్పటి వరకు కడుతున్నవి తాత్కాలిక భవనాలేనని.. ఆంధ్ర ప్రజలకు ఎందుకు ఈ ఖర్మ అని వ్యాఖ్యానించారు. (చంద్రబాబుకు ఉండవల్లి సూటి ప్రశ్న) శ్వేతపత్రాలపై చర్చకు ప్రభుత్వం తరఫున ఎవరు స్పందించడం లేదన్నారు. మోసం చేయడానికే శ్వేతపత్రాలు అంటే ఎవరేం చేసేది లేదని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రాలపై ఐఏఎస్ అధికారులతో చర్చ పెట్టాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పోలవరం, ఇరిగేషన్, ఆదరణ, ఎల్ఈడీ బల్బులు, అన్నా క్యాంటీన్ సహా వేటిపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 600 రూపాయలు ఖరీదు చేసే ఎల్ఈడీ బల్బు అని.. 7వేల రూపాయలు ఖరీదు చేసే సెల్‌ఫోన్‌ను 12వేల రూపాయలని శ్వేత పత్రంలో చూపారని అన్నారు. ప్రతి రంగంలో జరుగుతున్నా అవినీతి అద్దం పట్టేలా కనిపిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. ఆరోపణలపై స్పందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని అన్నారు. -
ప్రయివేటుకు వెలుగులు.. పేదలకు చీకట్లు
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అనేక వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రానివ్వకుండా జాగ్రత్తపడింది. అంకెల గారడీతో పరుగుల పురోభివృద్ధి పెట్టించాలనే ప్రయత్నం చేసినట్టు కన్పిస్తోంది. మిగులు విద్యుత్ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సమయంలో తమ నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించలేకపోయింది. ఛార్జీల పెంపు రూపంలో జనం నుంచి పిండుకోవడం మాత్రమే తెలిసిన సర్కారు దండుకునే మార్గాన్వేషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు అనుసరించి ఏకంగా రూ. 5,742 కోట్లకుపైబడి ప్రజలపై భారం మోపడాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్‌తో డిస్కమ్‌ల అప్పులన్నీ తీరిపోయినా... విద్యుత్ సంస్థలు మళ్ళీ ఆర్థిక లోటులోకి ఎందుకెళ్లాయో వివరించనే లేదు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా ఏయేటికాయేడు జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ఏ ప్రైవేటు సంస్థల కోసం తగ్గించారో స్పష్టం చేస్తే బాగుండేదేమో! విద్యుత్ వ్యవస్థ విస్తరణ జరిగినట్టు చెబుతున్న ప్రభుత్వం నాలుగేళ్ళుగా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడానికి కారణాలేంటి? అయినవాళ్ళకు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులిచ్చి అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం వాస్తవాలకు కడుదూరంలో ఉంది. మిగులు ఓ డ్రామా! రాష్ట్ర విభజన నాటికున్న 22 ఎంయూల విద్యుత్ లోటును అధిగమించి మిగుల్లోకి వెళ్ళామనేది ప్రభుత్వ వాదన. దీన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఈ నాలుగేళ్ళల్లో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,250 మెగావాట్లు పెరిగింది. వైఎస్ హయాంలో ఏర్పాటు చేసిన 1600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు 2016లో వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చింది. ఆర్టీపీపీ నాల్గవ దశ 600 మెగావాట్లు వైఎస్ హయాంలోదే. నాగార్జున టేల్పాండ్ 25 మెగావాట్లు కూడా పాత ప్రభుత్వాల కాలంలో తీసుకొచ్చినవే. ఏపీ జెన్కో పరిధిలో ఒక్క మెగావాట్ ప్లాంట్ కూడా చంద్రబాబు కాలంలో ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్లాంట్ల విద్యుత్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్లని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్లు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోకు 4,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కేవలం థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచే రోజుకు 84 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే సత్తా ఉంది. జల విద్యుత్ కేంద్రాల నుంచి మరో 24 మిలియన్ యూనిట్లు తీసుకోవచ్చు. రోజుకు మరో 34 మిలియన్ యూనిట్లు కేంద్ర విద్యుత్ వాటాగా రాష్ట్రానికి అందుతుంది. అంతర్రాష్ట్ర జల విద్యుత్ వాటాగా ఇంకో 25 మిలియన్ యూనిట్లు వచ్చే వీలుంది. ఇవన్నీ కలుపుకుంటే రోజుకు 167 మిలియన్ యూనిట్ల వరకూ ఉంటుంది. ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వం ఏపీ జెన్కో ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గిస్తోంది. 2016–17 లెక్కల ప్రకారం కేవలం 10,119 మిలియన్ యూనిట్లు మాత్రమే జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అంటే రోజుకు 84 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే... కేవలం 27 మి.యూనిట్లకు పరిమితం చేశారు. మరోపక్క ప్రైవేటు విద్యుత్‌ను రోజుకు 25 నుంచి 30 మిలియన్ యూనిట్లకు పెంచారు. జెన్కో విద్యుత్ ఉత్పత్తి సగటున రూ. 4 లోపే లభిస్తుంది. ప్రైవేటు విద్యుత్ సగటున రూ. 6 వరకూ ఉంటుంది. కాబట్టే డిస్కమ్‌లు నష్టపోతున్నాయి. 2014–18 మధ్య కాలంలో రాష్ట్రంలో జెన్కో, ప్రైవేటు కలిపి 9,529 మెగావాట్ల నుంచి 19,080 మెగావాట్లకు పెరిగింది. అంటే పెరిగింది 9,551 మెగావాట్లు. ఇందులో జెన్కో సామర్త్యం 2250 మెగావాట్లు పెరిగితే, ప్రైవేటు ఉత్పత్తి సామర్థ్య 7,301 మెగావాట్లు పెరిగింది. ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక ఉద్దేశ్యమేమిటి? జనానికి మోత... కార్పొరేట్లకు చేరవేత! విద్యుత్ పంపిణీ సంస్థలను రుణ విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్కమ్ అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకాన్ని తీసు కొచ్చింది. అందరికంటే ముందే మన రాష్ట్రం ఇందులో చేరింది. డిస్కమ్‌ల అప్పును 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. ఈ మొత్తాన్ని కేంద్రం అప్పుగా ఇప్పిస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ హామీతో డిస్కమ్‌లు బాండ్లు విడుదల చేశాయి. మొత్తం మీద 2017 నాటికే డిస్కమ్‌లు అప్పుల్లోంచి బయటపడ్డాయి. కానీ 2018 నవం బర్లో ఏపీఈఆర్సీకి సమర్పించిన నివేదికల ప్రకారం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటును పేర్కొన్నాయి. కారణమేంటి? వైఎస్ హయాంలో ఆరేళ్ళ పాటు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరగలేదు? బాబు ప్రభుత్వం వచ్చీ రావడం తోనే ఇలా వేల కోట్ల భారం ఎందుకు వేస్తుంది? ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి. డిస్కమ్‌లు ప్రతీ యూనిట్‌కు రూ. 5.94 చొప్పున వెచ్చిస్తున్నాయి. కానీ వినియోగదారుడికి దీన్ని యూనిట్ రూ. 4.53 చొప్పునే విక్రయిస్తున్నాయి. కాబట్టి యూనిట్‌కు రూ. 1.42 చొప్పున నష్టం వస్తోందనేది పంపిణీ సంస్థల వాదన. ఇలా అమ్మితే ముమ్మాటికీ నష్టమే. కానీ ఇలా అమ్మాల్సిన అవసరం ఏమిటి? బహిరంగ మార్కెట్లో విద్యుత్ యూనిట్ రూ. 1.99కే లభిస్తోంటే, పంపిణీ సంస్థలు మాత్రం రూ. 5.94 ఎందుకు ఖర్చుపెడుతున్నాయి? అసలు కథ వేరుగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరో పణలూ ఉన్నాయి. అవసరానికి మించి మాత్రం విద్యుత్ కొనుగోలు చేశారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి 57,018 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరిపోతుంది. కానీ ప్రభుత్వం 67,948 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అంటే 10,930 మిలియన్ యూనిట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. దీన్నిబట్టి అవసరం లేని ఈ విద్యుత్‌కు రూ. 6,492 కోట్లు చెల్లిస్తుంది. డిస్కమ్‌లు కొనుగోలు చేసే విద్యుత్‌లో 50 శాతం ప్రైవేటు విద్యుత్తే ఉంటుంది. ఇలా జనం నుంచి దోచుకునే డబ్బంతా ప్రైవేటు జేబుల్లోకి వెళ్తుంది. కాబట్టే పంపిణీ సంస్థ లకు నష్టాలొస్తున్నాయి. ఆ భారాన్ని జనంపై వేస్తున్నారనేది సుస్పష్టం. ఏటా షాక్లే! టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్ ఛార్జీలను పెంచింది. 2015–16 సంవత్సరంలో ఏకంగా రూ. 941 కోట్ల భారం విద్యుత్ వినియోగదారులపై వేసింది. మరో రూ. 750 కోట్లు ట్రూ అప్ ఛార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ఈసారి కాస్తా జాగ్రత్తగా వ్యవహరించింది. నేరుగా రూ. 242 కోట్ల మేర ఛార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ. 1,200 కోట్లు దండుకుంది. 2014–15 లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ ఇది. మొదటి 50 యూనిట్లకు రూ. 1.45 (యూనిట్‌కు) చొప్పున చెల్లించే విద్యుత్ వినియోగదారుడు ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాలి. దీనిబట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది. 2017–18 లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది. 1 కేవీ లోడ్ దాటితే ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే వెయ్యి వాట్స్కు సరిపడా లోడ్ ఉంటే బిల్లు మోతమోగినట్టే. రకరకాల విద్యుత్ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్ దాటని వారు ఎవరుంటారు? నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్య తరగతి వినియోగదారుడి బిల్లు రూ. 150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? విద్యుత్ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహి స్తున్న ప్రభుత్వం భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది. సంస్కరణల పేరుతో విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా, ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్ళుగా ప్రజాభిప్రాయ సేకరణలో పలు అంశాలు ముందుకొచ్చినా ఏపీఈఆర్సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ము గాస్తోందనే ఆరోపణలున్నాయి. వాస్తవాలు మరుగున పరచిన ప్రభుత్వం అంకెల గారడీతో శ్వేతపత్రం విడుదల చేయడం దురదృష్టకరం. – వనం దుర్గా ప్రసాద్, సాక్షి ప్రతినిధి -
‘చెప్పండి బాబూ.. లింక్ ఎలా కుదురుతుంది’
సాక్షి, రాజమండ్రి : శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. 10 రోజులు అమరావతిలోనే ఉంటానని దమ్ముంటే టీడీపీ ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఓవైపు ఏపీ టాప్‌లో ఉందంటూ శ్వేతపత్రంలో గొప్పలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మోసం చేసిందని అంటున్నారు. ఈ రెండింటికి లింక్ ఎలా కుదురుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. శ్వేతపత్రంలో ఉన్న నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. శ్వేతపత్రంలోని అంశాలు నిజాలే అయితే చర్చ పెట్టండి అని పునరుద్ఘాటించారు. చర్చలో తనది తప్పని తేలితే క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. ఏం అంశంపై అయినా తప్పులు మాట్లాడి చంద్రాబాబు దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఇంకా మాయ చేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అది మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారమే.. అన్నా క్యాంటిన్ భోజనం మధ్యాహ్న భోజన పథకంలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. అన్నా క్యాంటిన్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయితే.. యభై లక్షలుగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పోలవరం, అమరావతి నిర్మాణాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
అంకెల గారడీలో విద్యాప్రమాణాలు
రాష్ట్రంలో మానవవనరుల అభివద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం అసత్యాలు, అర్థసత్యాలు, అబద్ధాలతో నిండి ఉంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో ప్రమాణాలు, ఇతర అంశాలపై ప్రభుత్వం చూపుతున్న గణాంకాలు అంకెల గారడీ తప్ప మరేమీ కాదని వాస్తవిక పరిస్థితి చూస్తే స్పష్టమవుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ విభాగాల ద్వారా ప్రభుత్వం గణాంకాలు రూపొందింపచేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు వాటిని శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసిందని అర్థమవుతోంది. బడ్జెట్ నిధుల కేటాయింపు నుంచి విద్యా ప్రమాణాల వరకు అన్ని అంశాల్లోనూ ఇదే పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగున్నరేళ్ల కాలంలో హేతుబద్ధీకరణ పేరిట వేలాది పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంత సామాన్య, నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్యను దూరం చేసింది. ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ విద్యను వ్యాపారమయంగా మార్చేసింది. వేలాది రూపాయల ఫీజులు కట్టలేక, పిల్లల చదువులు ఆపలేక ఆయా కుటుంబాలు పాఠశాల విద్యనుంచే అప్పుల పాలు కావలసిన పరిస్థితులు నేడు రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీచేయకుండా మిగిలిపోయిన టీచర్లను వాటిలో సర్దుబాటు చేస్తూ నిరుద్యోగ యువతకూ మొండిచేయి చూపింది. రేషనలైజేషన్ పేరిట మూతపెట్టిన పాఠశాలల భవనాలు, మౌలిక సదుపాయాలను ప్రయివేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ యూనివర్సిటీలను నీరుగారుస్తూ మరోపక్క ఫీజుల పేరిట విద్యార్థులను పీల్చిపిప్పిచేసే ప్రైవేటు యూనివర్సిటీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తోంది. ప్రభుత్వ సంస్థలకు భూములు లేవంటూనే ప్రయివేటు సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెడుతోంది. బడ్జెట్ నిధుల కేటాయింపులో గారడీ పాఠశాల విద్యలో బడ్జెట్ కేటాయింపులు గతంలో కన్నా భారీగా పెంచినట్లు ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంటోంది. కానీ పీఆర్సీ, ఇతర అంశాల వల్ల పెరిగిన భారానికి తగ్గట్టుగానే ఆ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయే కానీ కొత్తగా విద్యాభివద్ధి కోసం కేటాయింపులు లేవన్నది నిజం. పైగా బడ్జెట్ కేటాయింపు నిధుల అంకెల్లో కూడా మతలబు చేస్తోంది. ఉదాహరణకు 2018–19 సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు రూ.3349 కోట్లు కేటాయించినట్లు రాష్ట్రప్రభుత్వం పేర్కొంటోంది. కానీ వాస్తవానికి ఉన్నత విద్యాశాఖ రూ.1,971 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే రాష్ట్రప్రభుత్వం కేటాయించినది కేవలం రూ. 1,452 కోట్లు మాత్రమేనని ఆ శాఖ అంతర్గత కేటాయింపు గణాంకాలు చెబుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రప్రభుత్వం విద్యారంగానికి యూజీసీ, రూసా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖల ద్వారా ఇచ్చే నిధులను కూడా తన కేటాయింపుల కింద చూపిస్తూ గారడీ చేస్తోంది. పాఠశాలల మూసివేత రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ హేతుబద్ధీకరణ ప్రక్రియకు తెరలేపారు. పాఠశాలల్లో తగినంతమంది విద్యార్ధులు లేరన్న సాకుతో 5వేలకు పైగా స్కూళ్లను మూసివేయిం చారు. వీటిలో ఎక్కువగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలే ఉన్నాయి. ఇక్కడి విద్యార్థులను సమీపంలోని మరో పాఠశాలలో చేరాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. పాఠశాలలు లేక ఆయా గ్రామాల్లోని విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈపాఠశాలల్లోని టీచర్లను సైతం ఇతర పాఠశాలల్లో ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. సరిపడ విద్యార్థులు లేరంటూ పాఠశాలలు మూసి వేస్తున్న పాఠశాలల ప్రాంతాల్లో ప్రయివేటు పాఠశాలల ఏర్పాటు చేయిస్తోంది. పీజులతో నిలువుదోపిడీ రాష్ట్రంలో ప్రయివేటు పాఠశాలలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కొత్త చట్టాలను కూడా చేస్తోంది. ఇందుకోసం ’సెల్ఫ్‌ఫైనాన్స్‌డ్ ఇండిపెండెన్స్ స్కూల్స్ యాక్ట్’ను రూపొందించింది. దీని ప్రకారం ఇకపై ప్రయివేటుస్కూళ్లను కార్పొరేట్ సంస్థల ద్వారా ఏర్పాటు అవుతాయి. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి ఆజమాయిషీ ఉండదు. పిల్లల తల్లిదండ్రులు కూడా వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాలు లేక వేలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కింద ప్రయివేటులో బడ్జెటరీ స్కూళ్లను పెట్టుకొని కొనసాగుతున్నారు. అటు పేదలకు తక్కువ ఫీజులతో విద్యనందిస్తూ వీరు ఉపాధి పొందుతున్నారు. ఈ కొత్త చట్టం ద్వారా ఈ స్కూళ్లు కూడా మూతబడి వాటిస్థానంలో కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటుచేయాలన్నది ఈ చట్టం ఉద్దేశం. ఈ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు భారీగా ఉంటూ రాష్ట్రంలో ఎల్కేజీ విద్యనుంచే వేలు, లక్షలకు చేరుకొని పేద, సామాన్యుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ నారాయణ, చైతన్య వంటి సంస్థల స్కూళ్లు వీధికొకటిగా పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతున్నాయి. తప్పుడు లెక్కలపై కాగ్ అక్షింతలు రాష్ట్రంలోని విద్యాప్రమాణాలపై ప్రభుత్వం చూపించిన గణాంకాల తీరును పలు సందర్భాల్లో కాగ్ అక్షింతలూ వేసింది. విద్యార్థుల నమోదు పెంచామని, డ్రాపవుట్లను తగ్గించామని చూపించిన గణాంకాలు పాఠశాల విద్యాశాఖ ఒకలా సర్వశిక్ష అభియాన్ మరోలా పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తప్పుడు అంకెలతో ప్రమాణాలు చూపిస్తున్నారని పలుమార్లు మండిపడింది. పదో తరగతి ప్రమాణాల్లో గణితంలో ప్రథమస్థానంలో, ఇతర సబ్జెక్టులలో రెండో స్థానంలో ఉన్నామని, విద్యాభివృద్ధిలో జాతీయస్థాయిలో ముందంజలో ఉన్నామని శ్వేతపత్రంలో పేర్కొంది. అయితే ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చూపిస్తోందన్న ఆరోపణలున్నాయి. డీఎస్సీకి చెల్లుచీటీ రాష్ట్రంలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని డీఎస్సీని భర్తీచేయకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పాఠశాలల్లో టీచర్లు లేక విద్యాప్రమాణాలు అడుగంటుతున్నా ప్రభుత్వం పోస్టులను భర్తీచేయడం లేదు. రాష్ట్రంలో గత ఏడాదిలో 23వేల పోస్టులకుపైగా ఖాళీలున్నాయని ప్రభుత్వమే ప్రకటించింది. ఆ తరువాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 30వేలకు పైగా చేరుతుంది. అయినా ప్రభుత్వం ఇటీవల డీఎస్సీలో కేవలం 7729 పోస్టులను మాత్రమే ప్రకటించింది. ఒకపక్క పాఠశాలల్లో చేరికలు భారీగా పెరుగుతున్నాయని శ్వేతపత్రంలో చూపుతూనే మరోపక్క టీచర్లు, విద్యార్థుల నిష్పత్తిని తక్కువగా చేసి చూపుతూ హేతుబద్ధీకరణ పేరిట పాఠశాలలను మూసివేతకు సిద్ధపడుతోంది. ఉత్తీర్ణతలో పురోగతి.. నైపుణ్యాల్లో అథోగతి రాష్ట్రంలో ఎస్సెస్సీలో ఉత్తీర్ణత శాతాలు ఏటేటా పెరిగిపోతూ ఇప్పటికి 96 శాతానికి చేరుకోవడం విద్యారంగ నిపుణుల్ని విస్మయానికి గురిచేస్తోంది. చంద్రబాబునాయుడు 1995లో అధికారం చేపట్టినప్పటినుంచే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అంతకు ముందు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం పగడ్బందీగా జరిగేది. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రయివేటును ప్రోత్సహిస్తూ ఆ సంస్థలను పెంచుకుంటూ పోయారు. వాటిపై విద్యాశాఖకు పెత్తనం లేకుండా పోయింది. మాస్ కాపీయింగ్‌తో పాటు మూల్యాంకణంలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటి వరకు ఉత్తీర్ణత శాతం 50 శాతానికి మించకుండా ఉండగా ఆతరువాత నుంచి క్రమేణా పెరుగుతూ ఏకంగా 96 శాతానికి వచ్చింది. ఇంత పెరిగినా ఆమేరకు ప్రమాణాలు ఉంటున్నాయా? అంటే అదీ లేదు. అయినా ప్రభుత్వం శ్వేతపత్రంలో అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు పేర్కొంటుండడం విశేషం. ఇంటర్మీడియట్ విద్యలో ప్రయివేటుదే పెత్తనం రాష్ట్రంలో కీలకమైన ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా ప్రయివేటు కార్పొరేట్ సంస్థల చేతుల్లో నడుస్తోంది. మొత్తం ఇంటర్మీడియట్ కాలేజీలు 3200 ఉండగా అందులో 2700 కాలేజీలు నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రయివేటు కార్పొరేట్ సంస్థలవే. ప్రభుత్వం నిర్దేశిత నిబంధనలు వీటికి పట్టనేపట్టవు. ఫీజులు12500కు మించరాదని రూలు ఉన్నా ఈ కాలేజీలు రూ.లక్షల్లో వసూలు చేస్తూ విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. పలు సంస్థలు అక్రమంగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లను నిర్వహిస్తూ రూ.3 లక్షలవరకు పిండుకుంటు న్నాయి. వీటికి కనీసం అనుమతులూ లేవు. విద్యార్థులను జైళ్లలో పెట్టినట్లు బంధించి చదువుల పేరిట తీవ్ర ఒత్తిళ్లు పెడుతుండటంతో గత కొన్నేళ్లలో వందల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటికి కారణమైన కాలేజీలపై చర్యలు తీసుకోకపోవడం అటుంచి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో వాటికి మరింత వెన్నుదన్నుగా చంద్రబాబు నిలిచారు. ఆత్మహత్యల నివారణకు నిపుణులు కమిటీలు ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలు తప్ప అమలు కావడం లేదు. సర్కారు యూనివర్సిటీలు నిర్వీర్యం చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రయివేటు యూనివర్సిటీలకు భూములు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తూ అదే సమయంలో ప్రభుత్వ వర్సిటీలకు నిధులు, ఇతర వనరులను సమకూర్చకుండా నిర్లిప్తత దాలుస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా జిల్లాకొక యూనివర్సిటీ చొప్పున దాదాపు అన్నిచోట్లా ఏర్పాట్లుచేయగా కొత్తగా ఒక్క ప్రభుత్వ వర్సిటీని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఏకంగా 11 ప్రయివేటు వర్సిటీలకు భూములను మాత్రం కట్టబెట్టారు. ప్రభుత్వ వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నా భర్తీచేయలేదు. 4వేల బోధనా పోస్టులు ఖాళీగా ఉన్నా రేషనలైజేషన్ పేరిట వాటిని కుదించి 1385 చేశారు. వేలాదిమంది విద్యార్థులు ఎలాంటి ప్రమాణాలు లేకుండానే పట్టాలు చేతపట్టుకొని బయటకు వస్తున్నారు. శ్వేతపత్రాల్లో చూపిస్తున్న అంశాలు ఒకటి కాగా ప్రభుత్వం నిర్దిష్ట విద్యాలక్ష్యాల మెరుగుకు ఈ నాలుగున్నరేళ్లలో చేసిన కృషి అంతంతమాత్రమేనన్నది సుస్పష్టం. - సీహెచ్.శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి -
ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు: చాడ
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ ఈ మూడున్నరేళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల్లో పెరిగిపోతున్న అసహనాన్ని గమనించి ప్రభుత్వం ఉత్తుత్తి నోటిఫికేషన్లతో మాయ చేస్తోందని విమర్శించారు. మఖ్దూంభవన్‌లో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్లతో ఎర చూపుతున్నారు తప్పితే ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదని విమర్శించారు. అలాగే ఐటీ సెక్టారులో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో వెల్లడించాలన్నారు. సామాజిక తెలంగాణ, సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ చేపట్టిన పోరుబాట యాత్ర విజయవంతమైందని, ప్రజల నుంచి అనేక ఆకాంక్షలు వ్యక్తమయ్యాయని తెలిపారు. -
మూడేళ్ల పాలనలో బడుగులకు ఏం చేశారు?
శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనవర్గాలకు ఇచ్చిన హామీలు తన మూడేళ్ల పాలనలో ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలే జయంతిని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. పూలే జయంతిని ఘనంగా నిర్వహించామని టీడీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే చాలదని, అసలు బలహీన, బడుగు వర్గాల సంక్షే మానికి చేసిందేమిటో చెప్పాలన్నారు. 2014 ఎన్నికల్లో బలహీనవర్గాలకు వివిధ అంశాలపై ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికలకు ముందు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకునే వాళ్లమని, ఎన్నికల తరువాత అది కాస్తా ‘బాబు గారి క్లాస్’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. -
'శ్వేతపత్రం విడుదల చేయాలి'
రేగోడ్(మెదక్ జిల్లా): మీకు దమ్మూ దైర్యం, సత్తా ఉంటే ఉద్యోగ ఖాళీలపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం గజ్వాడ గ్రామానికి ఆదివారం విచ్చేసన ఆయన ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కొత్త జిల్లాలకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వండని అడగడం లేదని..ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడక ముందు, ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో శ్వేత పత్రం స్పష్టంగా విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు.