
సాక్షి, విజయవాడ: పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కుమారుడి వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కానూరు వీఆర్ సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన వివాహ వేడుకలో వరుడు నితిన్ కృష్ణ, వధువు అమృత భార్గవి (ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కుమార్తె)లను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.