
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి కొడాలి నాని మేనకోడలి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో వధూవరులు డా. స్నేహ, డా.అనురాగ్ దీపక్‌లను సీఎం జగన్ ఆశీర్వదించారు.
కనకదుర్గ అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు
కాగా, రేపు(శుక్రవారం) ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పట్టు వస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలను ప్రభుత్వం తరపున అందించనున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రమైన మూల.. ఈ నెల 20వ తేదీ, శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు.
చదవండి: విజయదశమి: అర్చకులకు సీఎం జగన్ తీపికబురు
Comments
Please login to add a commentAdd a comment