
'హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు'
చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని పార్థసారధి విమర్శించారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
విశాఖపట్నంలో జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసి రావాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను పదేపదే మోసం చేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు.