ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్‌సీపీ మొదటినుంచీ పోరాడుతోందన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, మల్లాది విష్ణులు గురువారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా సంజీవని కాదు అన్నారు. సదస్సులు నిర్వహించి ఏపీకి హోదా అక్కర్లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పడానికి సీఎం చంద్రబాబు విఫలయత్నాలు చేశారు