మంతెనలో వల్లభనేని బాలశౌరి, కొలుసు పార్థసారథిలపై పూలవర్షం కురిపిస్తున్న చిన్నారి
సాక్షి, మంతెన(కంకిపాడు): సంక్షేమ పాలన కోసం వైసీపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆపార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త వల్లభనేని బాలశౌరి విజ్ఞప్తిచేశారు. మండలంలోని మంతెన గ్రామంలో గురువారం రాత్రి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ప్రచార వాహనంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథితో కలిసి పర్యటించారు. స్థానిక బోసు బొమ్మ, ఎస్సీ కాలనీ సెంటర్లలో జరిగిన సభల్లో బాలశౌరి ప్రసంగించారు.
నీతికి, నిజాయతీకి మారుపేరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన టీడీపీకి మధ్యనే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. టీడీపీ నేతలు అన్ని వర్గాల ప్రజలనూ వంచించారన్నారు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావా లన్నా, బందరు పోర్టును సాధించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలనాకాలంలో మాదిరిగా రెండు పంటలకూ డెల్టాలో నీరిచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పార్టీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి మాట్లాడుతూ డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ కాలేదన్నారు. మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్తు ప్రజల్ని మోసం చేయాలని టీడీపీ చూస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పాలకులను, ఓట్లు అడిగేందుకు వచ్చేటీడీపీ నేతలను చొక్కా పట్టుకుని నిలదీయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాలకూ పథకాలు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంతెన గ్రామంలో ఇళ్లస్థలాలు పంపిణీకి కృషి చేస్తామని, వసతులు మెరుగు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బలహీనవర్గాల ప్రజలపై కనీస గౌరవం లేని టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో సారథి తనయుడు నితిన్‌కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, రాష్ట్ర నేతలు తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), నక్కా శ్రీనివాసరావు, రామినేని రమాదేవి, వల్లె నర్సింహారావు, జిల్లా నాయకులు బండి నాంచారయ్య, మాదు వసంతరావు, బాకీ బాబు, నెరుసు సతీష్, అన్నే చంటిబాబు, మాగంటి శ్రీను, మంతెన గ్రామ నేతలు బండి శ్రీను, పటాకుల శ్రీనివాస్, ఎంపీటీసీ కె. వెంకటేశ్వరరావు, వీరంకి రమణ, భావన్నారాయణ, కొండేటి నాని, రాజులపాటి శివబ్రహ్మేశ్వరరావు, కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత కంకిపాడు ప్రధాన సెంటరు నుంచి పార్టీ రాష్ట్ర నేతలు కొండవీటి వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో యువత మోటరు బైక్ ర్యాలీ చేశారు. మంతెన ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment