► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి
► ఏపీఎస్‌ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలేదీక్షలకు సంఘీభావం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అలంకార్‌సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఏపీఎస్‌ఏసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనబకాయిలు చెల్లించాలని, విధుల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతూ ఐదు రోజులుగా ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్థసారధి మాట్లాడుతూ ఏపీఎస్‌ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు.
రాష్ట్ర పరిపాలన దిశా నిర్దేశం చేసే సంస్థ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఎన్నో సేవలు అందించిందన్నారు. సంస్థలో పనిచేస్తున్న 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వ లోపమన్నారు. సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తూ, ఉత్తరాది రాష్ట్రాల వారికి అధికంగా చెల్లిస్తున్నారన్నారు. ఉద్యోగులును సత్వరమే విధుల్లోకి తీసుకుని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ, సీపీఎం నాయకులు దోనేపూడి శంకర్, సీహెచ్ బాబూరావు, వైఎస్సార్‌సీపీ నాయకులు పైలా సోమినాయుడు, గౌస్‌మొహిద్దీన్, మాదు శివరామకృష్ణ, సీఐటీయూ నాయకులు ఎంవీ సుధాకర్, అసోసియేషన్ నాయకులు ఎఎం రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా బాణా సంచా పేల్చేందుకు ఎలాంటి అనుమతులు నిర్వాహకులు తీసుకోలేదు.ఇందుకు కారకులైనవారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వై.అంకినీడు ప్రసాద్,గుడివాడ డీఎస్పీ