Wage arrears
-
క్లాప్‌మిత్రల వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేసే క్లాప్ మిత్రలకు (పారిశుధ్య కార్మికులు) వేతన బకాయిలన్నింటినీ వేగంగా చెల్లించే ప్రక్రియ ఇటీవలే మొదలైందని.. అయినా “ఈనాడు’ పత్రిక ఉద్దేశపూర్వకంగా ఓ తప్పుడు భావనతో మంగళవారం “పారిశుధ్య కార్మికులకూ జగన్ దెబ్బ’ అంటూ దుష్ప్రచారం చేస్తూ కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. నిజానికి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43,534 మంది క్లాప్‌మిత్రలకు 2022 అక్టోబరు నుంచి జూన్ 2023 మధ్య కాలానికి చెల్లించాల్సిన వేతన బకాయిలకు గాను రూ.84.03 కోట్లు ఇప్పటికే చెల్లించడం జరిగిందని, మరో రూ.141 కోట్ల చెల్లింపు ప్రక్రియ పురోగతిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ “ఫ్యాక్ట్ చెక్’ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ చెల్లింపులకు గాను 2,055 గ్రామ పంచాయతీల్లో వెండర్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇక మీదట గ్రామ పంచాయతీల నిధుల నుంచి ఎప్పటికప్పుడు క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపులు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు.. మరోవైపు.. క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేందుకు వీలుగా ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటుచేసినట్లు కూడా ఆ శాఖ వివరించింది. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం నూతన విధానాలను అవలంబిస్తూ.. గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం పోగవకుండా పూర్తి పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని 2021 అక్టోబరు 2న ప్రారంభించిందని.. ఆ రోజు నుంచి ప్రతి గ్రామంలోనూ ఉ.6గంటల నుంచి క్లాప్‌మిత్రల ద్వారా ఇంటింటి నుంచి చెత్త సేకరణ కొనసాగుతోందని తెలిపింది. ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 43,534 మంది పనిచేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియలో.. గ్రామ పంచాయతీలకు 32,777 చెత్త తరలించే రిక్షాలు, 1,004 టిప్పర్లను ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చినట్లు పంచాయతీరాజ్‌శాఖ వివరించింది. అలాగే, ప్రతినెలా క్లాప్‌మిత్రల వేతనాల చెల్లింపు కోసమే ప్రభుత్వం రూ.27 కోట్లు ఖర్చుచేస్తోందని తెలిపింది. -
దశాబ్దానికి దక్కిన న్యాయం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన ఓ కండక్టర్ తనకు రావాల్సిన వేతన బకాయిల కోసం దశాబ్దం కాలంగా చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆ కండక్టర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలను, ఇతర ఉద్యోగులు (కండక్టర్లు)తో సమానంగా అన్ని ఇంక్రిమెంట్లను కలిపి ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీతో సహా రెండు నెలల్లో చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ తీర్పు చెప్పారు. వైకల్యం బారిన పడిన ఉద్యోగిని వదిలేయకుండా అతనికి గతంలో నిర్వహించిన పోస్టుకు సమానమైన ప్రత్యామ్నాయ పోస్టును, అదే జీతం, సర్వీసు ప్రయోజనాలతో సహా కల్పించాల్సిన బాధ్యత యజమానిగా ఆర్టీసీపై ఉందని స్పష్టంచేశారు. అధికారులు పట్టించుకోలేదు... కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన సీహెచ్ రాజేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో ఆయన వెన్నెముకకు వైద్యులు శస్త్రచికిత్స చేసి రెండు డిస్క్‌లను తొలగించారు. వైకల్యం కారణంగా రాజేశ్వరరావును ఆర్టీసీ యాజమాన్యం 2001లో రిటైర్ చేసింది. దీంతో రాజేశ్వరరావు 2005లో డిజేబుల్డ్ కమిషనర్ వద్ద కేసు దాఖలు చేశారు. విచారణ చేసిన కమిషనర్, అంగవైకల్య చట్ట నిబంధనల ప్రకారం పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను 2006లో ఆదేశించారు. దీంతో 2007లో ఆర్టీసీ అధికారులు రాజేశ్వరరావును తిరిగి సర్వీస్‌లో చేర్చుకున్నారు. బస్‌స్టేషన్‌లో ఆయన సర్వీసులను ఉపయోగించున్నారు. తనను రిటైర్ చేసిన 2001 నుంచి 2007 మధ్య కాలానికి సంబంధించిన బకాయిలన్నింటినీ చెల్లించడంతోపాటు కండక్టర్ కేడర్‌లో తనకు పే ఖరారు చేయాలని రాజేశ్వరరావు పలుమార్లు కోరారు. ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఆయన 2011లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల జస్టిస్ రవినాథ్ తిల్హరీ తుది విచారణ జరిపారు. ‘అంగవైకల్య చట్టంలోని సెక్షన్ 47(1) ప్రకారం సర్వీసులో ఉండగా ప్రమాదానికి గురైన ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించడం గానీ, ర్యాంకును తగ్గించడం గానీ చేయకూడదు. ఆ ఉద్యోగి గతంలో నిర్వహించిన పోస్టుకు çసమానమైన పోస్టు లేకపోతే తగిన పోస్టు ఇచ్చేంత వరకు ఆ ఉద్యోగి కోసం సూపర్ న్యూమరరీ పోస్టు సృష్టించి అందులో కొనసాగించాలి. వైకల్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కేసులో హైకోర్టు తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తోంది. పిటిషనర్‌కు 2001 నుంచి 2007 వరకు వేతన బకాయిలు, ఇంక్రిమెంట్లతోపాటు ఆరు శాతం సాధారణ వార్షిక వడ్డీ కలిపి రెండు నెలల్లో చెల్లించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. -
108, 104 ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 108 అంబులెన్సులు , 104 మొబైల్ మెడికల్ యూనిట్ సర్వీసుల్లో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపును ప్రారంభించినట్టు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ సంపత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల దృష్ట్యా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సకాలంలో వేతనాలను విడుదల చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు రావటంతో 2 నెలల వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు వివరించారు. -
వేతన బకాయిల చెల్లింపు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమల్లో భాగంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలలకు గాను చెల్లించాల్సిన వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. గత ఏడాది జూన్‌లో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2021 ఏప్రిల్, మే నెలల వేతన బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సి ఉంది. కానీ, వచ్చే నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపులకుగాను నిధుల సర్దుబాటు కష్టం కావ డంతో ఈ చెల్లింపులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో విడు దల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ రెండు నెలల వేతన బకాయిలను 2022, ఏప్రిల్ వేతనంలో (మేలో చేతికి వచ్చే) కలిపి ఇస్తారు. అప్పటి నుంచి 18 వాయిదాల్లో ఈ బకాయిల మొత్తాన్ని చెల్లిస్తారు. ఒకవేళ ఈ మధ్యకాలంలో ఉద్యోగి అకాల మరణం చెందితే మాత్రం వారి కుటుంబ సభ్యులు లేదా వారసులకు ఏకమొత్తంలో బకాయిలను చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సొసైటీలు తదితర సంస్థలకు చెందిన ఉద్యోగులకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. -
కానిస్టేబుళ్లకు ప్రత్యేక పెంపు అవసరం
సాక్షి, హైదరాబాద్: వేతన లోపాలు సవరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం కోరింది. గత పీఆర్సీల్లో చైర్మన్లు అన్ని విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల కొన్ని విభాగాల ఉద్యోగులు ముఖ్యంగా కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది. బుధవారం సచివాలయంలో పీఆర్సీ చైర్మన్ సీఆర్ బిస్వాల్, కమిటీ సభ్యుడు రఫత్ అలీని టీజీవో చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ కలసి గతంలో జరిగిన పీఆర్సీ నష్టాలను వివరించారు. ముఖ్యంగా కానిస్టేబుళ్లు గత పీఆర్సీల్లో వేతన సవరణ లోపాల కారణంగా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఒకప్పుడు సీనియర్ అసిస్టెంట్ కంటే ఎక్కువ వేతనం కలిగిన కానిస్టేబుళ్లకు గత పీఆర్సీ చైర్మన్ల నిర్లక్ష్యం కారణంగా వేతనం దారుణంగా తగ్గిపోయిందని తెలిపారు. ఎక్కువ పని చేసే వారికి అన్యాయం జరిగిందని వివరించారు. వారితోపాటు వేతన వ్యత్యాసాలు ఇతర విభాగాల్లోనూ ఉన్నాయని, వాటిని సవరించి న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సమైక్యాంధ్ర పాలనలో పీఆర్సీ అమలులో ఆలస్యం కారణంగా ఉద్యోగులు రెండు పీఆర్సీలు కోల్పోయారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి 11వ పీఆర్సీలో ఉద్యోగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు మంచి పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పీఆర్సీ రిపోర్టును త్వరగా తయారు చేసి ఆగస్టు మొదటి వారంలోపే సమర్పించాలని కోరారు. సమావేశంలో టీజీవో నేతలు రవీందర్రావు, కృష్ణమూర్తి, రాజ్‌కుమార్‌గుప్తా, ఉమాకాంత్, యాదగిరి, ఎంబీ కృష్ణాయాదవ్, జి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
వేతన బకాయిలు సత్వరమే చెల్లించాలి
► వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ► ఏపీఎస్ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రిలేదీక్షలకు సంఘీభావం గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): అలంకార్‌సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేపట్టిన రిలేనిరాహారదీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఏపీఎస్ఏసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనబకాయిలు చెల్లించాలని, విధుల్లోకి తిరిగి తీసుకోవాలని కోరుతూ ఐదు రోజులుగా ఆసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్థసారధి మాట్లాడుతూ ఏపీఎస్ఏసీ కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర పరిపాలన దిశా నిర్దేశం చేసే సంస్థ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఎన్నో సేవలు అందించిందన్నారు. సంస్థలో పనిచేస్తున్న 35 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించలేకపోవడం ప్రభుత్వ లోపమన్నారు. సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తూ, ఉత్తరాది రాష్ట్రాల వారికి అధికంగా చెల్లిస్తున్నారన్నారు. ఉద్యోగులును సత్వరమే విధుల్లోకి తీసుకుని, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులు దోనేపూడి శంకర్, సీహెచ్ బాబూరావు, వైఎస్సార్సీపీ నాయకులు పైలా సోమినాయుడు, గౌస్‌మొహిద్దీన్, మాదు శివరామకృష్ణ, సీఐటీయూ నాయకులు ఎంవీ సుధాకర్, అసోసియేషన్ నాయకులు ఎఎం రాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్ఠ సందర్భంగా బాణా సంచా పేల్చేందుకు ఎలాంటి అనుమతులు నిర్వాహకులు తీసుకోలేదు.ఇందుకు కారకులైనవారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వై.అంకినీడు ప్రసాద్,గుడివాడ డీఎస్పీ -
కూలీ.. కడుపు ఖాళీ
► నెలలుగా వేతనానికి నోచుకోని ‘ఉపాధి’ కూలీలు ► పనులకు వెళ్లేందుకు విముఖత ► గణనీయంగా తగ్గిన కూలీల సంఖ్య ► హాజరుకావాలని కోరుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ► జిల్లాలో రూ. 8.45 కోట్ల వేతన బకాయిలు ► ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం స్వేదం చిందించి శ్రమను నమ్ముకున్న బతుకులు భారంగా కాలం వెళ్లదీస్తున్న దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కళ్లకు కడుతున్నాయి. ఎన్నో నిరుపేద కుటుంబాలకు ‘ఉపాధి’ పనులే ఊతం. వీటి ఆధారంగా వచ్చే వేతనాలతోనే వారు జీవనం సాగిస్తున్నారు. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో చేతిలో డబ్బులు లేక కూలీలు అగచాట్లు పడుతున్నారు. తమ దయనీయ పరిస్థితిపై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పది వారాలపాటు పనిచేసిన డబ్బులు ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తాయో ఇప్పటికీ తెలియదు. ఉపాధి పనుల డబ్బులు వస్తేనే.. మా కుటుంబం గడిచేది. నెలల తరబడి ఒక్క పైసా కూడా మా ఖాతాల్లో పడకుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? నిధులు విడుదల చేశాకే మళ్లీ పనులకు వస్తాం. అప్పటిదాకా మా దారి వేరే’. జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీల మనోవేదన ఇది. ఏ కూలీని పలకరించినా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. ఫలితంగా పనులపై వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రస్తుతం పనుల్లోకి వచ్చే కూలీల సంఖ్య క్రమేపీ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి పనుల నిర్వహణకు మార్చి నెల అత్యంత కీలకం. ఇదే నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ లోగా నిర్దేశించుకున్న లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో వ్యవసాయ, దాని అనుబంధ పనులు కాస్త తక్కువగానే ఉంటాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతారు. గతేడాది ఇదే నెలలో పనుల్లోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 41 వేలు. ప్రస్తుతం 31 వేలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర నష్టమే.. ప్రతి నిరుపేద కుటుంబం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని పొందవచ్చు. దీనికి గడవు ఈ నెలాఖరు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 9,300 కుటుంబాలు వంద రోజుల ఉపాధి పొందాయి. మరో 4 వేలకు పైగా కుటుంబాలు 80 రోజుల పని మార్క్‌ను చేరుకున్నాయి. మరో 20 రోజులు పనుల్లోకి వెళ్తే ఉపాధి లక్ష్యం పరిపూర్ణం అవుతోంది. అయితే ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో వారంతా కొన్ని నెలలుగా పనులకు దూరంగా ఉంటున్నారు. నిధుల విడుదల మరింత జాప్యమైతే ఈ కూలీలు పని దినాలను నష్టపోయినట్లేనని స్పష్టమవుతోంది. మిగిలిన కుటుంబాలు కూడా ఉపాధిని కోల్పోయినట్లేనని కార్మిక నేతలు చెబుతున్నారు. పనులపై ప్రతికూల ప్రభావం.. ఉపాధిలో భాగంగా నీటి సంరక్షణ, స్వచ్ఛత పనులపై గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు దృష్టి సారించారు. నీటి, ఊట కుంటలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల తదితర పనుల లక్ష్యాలను ఈనెలాఖరులోగా చేరుకోవాల్సి ఉంది. అయితే ఆశించిన స్థాయిలో కూలీలు పనుల్లోకి రాకపోవడంతో ప్రగతిపై కొంత ప్రతికూల ప్రభావం అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను పనుల్లోకి రాని కూలీల వద్దకు రాయబారం పంపుతున్నారు. డబ్బులు ఎక్కడికీ పోవని.. త్వరలో వస్తాయని వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పనులకు హాజరుకావాలని వారిని కోరుతున్నారు. అయితే చాలా మంది కూలీలు మెట్టు దిగడం లేదు. వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవడం లేదని.. ఇలాంటప్పుడు పనుల్లోకి ఎలా వస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్‌లో రూ. 8 కోట్లకు పైమాటే.. జిల్లాలో ప్రస్తుతం నిత్యం సగటున 32 వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఏడాది ఆసాంతం (గతేడాది వేసవి నుంచి ఇప్పటి వరకు) దాదాపు 1.30 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారని అంచనా. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ. 62 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేసినా.. కూలీలకు మాత్రం సకాలంలో వేతనాలు అందడం లేదు. దాదాపు 65 వేల మంది కూలీలకు రూ. 8.45 కోట్లు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్ వరకు అరకొరగా వేతనాలు ఇస్తూ నెట్టుకొచ్చారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదని సమాచారం. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనాలు అందాల్సి ఉంది. కానీ, ఆ మేరకు జిల్లాలో పరిస్థితులు లేకపోకవడంతో కూలీలు సతమతం అవుతున్నారు. ఒక్కో కూలీకి వేల రూపాయల వేతనం రావాల్సి ఉంది. అయినా ఆలస్యమే... గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కూలీల ఖాతాల్లో జమచేసేది. ఈ విధానంతో వేతనాల అందజేతలో తీవ్ర జాప్యం చోటుచేసుకునేది. అంతేగాక సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం.. కూలీల ఖాతాల్లో జమ చేయ కపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని నిశ్చయించుకుంది. గత జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రానికి కేటాయింపులు జరిపిన నిధుల్లోంచే.. కేంద్రం కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేంద్రం.. రాష్ట్ర కోటా కింద రూ.300 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం నిధుల వినియోగం ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. మరో దఫా నిధుల విడుదలపై కార్యాలయాల మధ్య ఫైళ్లు కదులుతున్నాయని.. తొందరలోనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని వివరిస్తున్నారు. దీనిపై డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్‌ను వివరణ అడగగా.. త్వరలోనే డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అవుతాయని సమాధానమిచ్చారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం నిధులు వస్తాయని చెప్పారు. రూ.6వేలు రావాలి నేను, నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వచ్చిన కూలిడబ్బులే మాకు ఆధారం. ఇప్పటివరకు ఏడు వారాలకు సంబంధించిన దాదాపు రూ. 6 వేలు అందాల్సి ఉంది. కాని నేటికీ నయాపైసా అందలేదు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగితే.. గడువు పెడుతున్నా మార్పు లేదు. చేతిలో పైసలు లేక ఇంట్లకు అవసరమైన వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బందిగా మారింది. చివరకు ఉప్పు, పప్పు, కూరగాయలకూ వెనకాముందు ఆలోచిస్తున్నాం. అత్యవసరమైతే అప్పు చేస్తున్నాం. – కట్టెలబాలమ్మ, ఉపాధి కూలి, పోల్కంపల్లి రూ.3,653 రావాల్సి ఉంది ఐదు వారాలు పనులు చేస్తే ప్లే స్లిప్పులు వచ్చాయి. మొత్తం రూ.3,653 రావాల్సి ఉంది. కాని నేటికీ చెల్లించలేదు. ఎర్రటి ఎండల్లో కష్టపడి పని చేస్తే శ్రమకు తగిన ఫలితం రావడం లేదు. బయట పనికి వెళ్లకుండా ఉపాధిని నమ్ముకుంటే నిరాశకు గురి కాకతప్పడం లేదు. అధికారులను అడిగితే మేము బిల్లులు చేసి పంపించాం.... ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. కూలి డబ్బులు తొందరగా అందించి ఆదుకోవాలి. –గూడెం దానయ్య, కూలీ, పోల్కంపల్లి -
చిరుద్యోగికి.. ఏదీ సం‘క్రాంతి’?
నెలలుగా అందని వేతన బకాయిలు అప్పులఊబిలో అంగన్వాడీ, వయోజన విద్య కో–ఆర్డినేటర్లు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చిరుద్యోగుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడుతోంది. వచ్చే అరకొర వేతనాలనూ సక్రమంగా అందించక ముప్పుతిప్పలు పెడుతోంది. పండుగ దగ్గరపడుతున్నా పట్టించుకోవడంలేదు. కనీసం జీతాలు ఇవ్వాలన్న ధ్యాసే లేకుండా పోతోంది. పండుగను ఎలా నెట్టుకురావాలో తెలియక పలువురు తలలుపట్టుకుంటున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో సర్వశిక్షా అభియాన్ పథకం కింద 580 మందికిపైగా చిరుద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు లేవు. ఇంటికి వెళితే కుటుంబ నిర్వహణ బాధలు భరించలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలోనని ఉద్యోగులు ఆందోళనకు లోనవుతున్నారు. కలెక్టర్ కరుణించేనా? పండుగకు మూడు రోజులు మాత్రమే ఉంది. జీతాలు మంజూరవుతాయనే ఆశతో మిగతా 2వ పేజీలో u సర్వశిక్షాఅభియాన్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఒక్క నెల జీతంవస్తే తమ కుటుంబాన్ని నెట్టుకు రావచ్చని ఆశపడుతున్నారు. కలెక్టర్ జీతాల నివేదికలను పరిశీలించి ఆమోదిస్తే, ఆ నివేదికల అనంతరం జీతాల చెక్కును మళ్లీ కలెక్టర్‌కు సర్వశిక్షాఅభియాన్ అధికారులు పంపాలి. ఆ చెక్కును కలెక్టర్ పరిశీలించి సంతకం చేస్తే తర్వాత అధికారులు సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 12వ తేదీలోపు జరిగితే ఉద్యోగులకు సంక్రాంతి పండుగ. లేకుంటే పస్తులే. రూ.1 కోటి 68 లక్షలు అవసరం సర్వశిక్షా అభియాన్ పరిధిలో పీవో, సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్, ఏఎంవో, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ క్ల్లర్క్లు, ఇంజినీరింగ్ ఈఈ, ఏఈలు, మండల స్థాయిలో 576 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి గత నవంబర్, డిసెంబర్ జీతాలు రాలేదు. ఇవి ఇవ్వాలంటే రూ.1 కోటి 68 లక్షలు అవసరమవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంగన్వాడీలకు మూడు నెలలుగా పస్తులే! జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడీ, మినీ అంగన్వాడీ, ఆయాలు సుమారు 4,500 మందికిపైగా ఉన్నారు. బడ్జెట్ లేకపోవడంతో వీరికి గత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వేతనాలు ఇవ్వలేదు. ఒక్కో అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, మినీ, హెల్పర్లు ఒక్కొక్కరికీ రూ.4,500 ఇవ్వాల్సి ఉంది. సంక్రాంతికి కనీసం ఉప్పు, పప్పుకూడా కొనుక్కోలేక అల్లాడాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఒక్క నెల వేతనమైనా అందేనా? అంగన్వాడీ వర్కర్లు, ఆయాలకు ఈనెల ఐదో తేదీ కంటితుడుపుగా ఒక నెల వేతనానికి సరిపడా బడ్జెట్ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సీడీపీవోలు ఆ ప్రక్రియే ప్రారంభించకపోవడంతో ఆ వేతనం కూడా పండక్కు అందేటట్లు కనిపిం -
రెగ్యులరైజ్ అయ్యే ఉద్యోగులకు 50 శాతం వేతన బకాయిలు ఇవ్వాలి
ఎల్ఐసీకి ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు సవరణ న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) 3వ, 4వ తరగతి తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో పాటు, వారికి వేతన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, సంబంధిత ప్రయోజనాలనూ కల్పించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. పూర్తి వేతన బకాయిలు చెల్లించటం వల్ల సంస్థపై భారీగా ఆర్థిక భారం పడుతుందని.. తొలుత ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ ఎల్ఐసీ రివ్యూ పిటిషన్ వేయటంతో.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కార్మికులకు 50% వేతన బకాయిలు చెల్లించాలని సవరించిన ఆదేశాల్లో పేర్కొంది. -
నిజాం షుగర్స్ కథ కంచికి..
రూ. 4.27 కోట్ల మేర పేరుకుపోయిన వేతన బకాయిలు చెరుకు రవాణా రాయితీ రూ. 6 కోట్ల కోసం ఎదురుచూపు బీఐఎఫ్ఆర్కు నివేదించి చేతులు దులుపుకొన్న ఎన్డీఎస్ఎల్ కార్యదర్శుల కమిటీ నివేదిక పేరిట కాలయాపన చేస్తున్న సర్కార్ హైదరాబాద్: నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 క్రషింగ్ సీజన్లో చెరుకు గానుగను నిలిపివేసిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) యాజమాన్యం.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లే ఆఫ్‌ను ప్రకటించిన యాజమాన్యం.. కార్మికుల వేతన బకాయిలు రూ. 4.27 కోట్లు కూడా చెల్లించడం లేదు. రైతులకు నష్టం వాటిల్లకుండా.. ఫ్యాక్టరీ పరిధిలో సాగైన చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలించి గానుగ ఆడించారు. చెరుకు తరలింపులో భాగంగా రవాణాకు సంబంధించి ప్రభుత్వం ఇస్తామన్న రాయితీ మొత్తం రూ. 6 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదు. ఇదిలావుంటే.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి, వరుస నష్టాలతో ఫ్యాక్టరీని నడిపించే పరిస్థితిలో లేనందున.. ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చాలంటూ ఎన్డీఎస్ఎల్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం) ఇటీవల పారిశ్రామిక, ఆర్థిక పునర్నిర్మాణ మండలిని (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. అయితే డీపీఎం అభ్యర్థనను మాత్రమే బీఐఎఫ్ఆర్ నమోదు చేసుకుంది. ఎన్ డీఎస్ఎల్ను ఖాయిలా పరిశ్రమగా గుర్తిస్తేనే.. అప్పుల చెల్లింపు, ఫ్యాక్టరీ తిరిగి తెరిచే అంశం తెరమీదకు వస్తుంది. కార్యదర్శుల కమిటీ పరిశీలనలోనే టేకోవర్ అంశం ఎన్డీఎస్ఎల్ను టేకోవర్ చేసే అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ నివేదిక గత ఏడాది ఆగస్టులోనే సమర్పించాల్సి ఉంది. ఎస్బీఐ కాప్స్ అనే సంస్థకు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పుల మదింపు బాధ్యతను కార్యదర్శుల కమిటీ అప్పగించింది. ఎస్బీఐ కాప్స్ నివేదిక సమర్పించినా.. టేకోవర్ అం శం ఇంకా కార్యదర్శుల కమిటీ పరిశీల నలోనే ఉన్నట్లు ప్రభుత్వం చెప్తోంది. దీంతో ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడం అసాధ్యమని స్పష్టమవుతోంది. -
ఉద్రిక్తం
ఐకేపీ ఉద్యోగుల ‘చలో అసెంబ్లీ’ భగ్నం పెద్ద సంఖ్యలో కార్యకర్తల అరెస్ట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఐకేపీ ఉద్యోగులు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. వందలాది మంది ఐకేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం నుంచే సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరా పార్కు వద్ద పోలీసు బలగాలను మోహరింపజేశారు. అనుమానం వచ్చిన వారినందరినీ తనిఖీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐకేపీ కార్యకర్తలు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఎంబీ భవన్లో గుమిగూడారు. 11 గంటల ప్రాంతంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద వందలాది మంది ర్యాలీకి ఉపక్రమించగా...అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనేక మంది మహిళా ఉద్యోగులను పోలీసులు ఈడ్చుకుంటూ వ్యాన్ ఎక్కించారు. గంట పాటు ఆ ప్రాంతమంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అతి కష్టమ్మీద పోలీసులు ఆందోళనకారులను వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ... మరోవైపు అదే సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఎంబీ భవన్లో గుమిగూడిన ఐకేపీ ఉద్యోగులు సీఐటీయూ నాయకురాలు పుణ్యవతి నేతృత్వంలో ఇందిరా పార్కు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కూడా పోలీసులకు, ఐకేపీ ఉద్యోగులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ తోపులాటలో పుణ్యవతికి స్వల్ప గాయమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తుననినాదాలు చేయగా అతి కష్టమ్మీద వారిని అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. 600 మంది అరెస్టు చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ధర్నా చౌక్‌కు వస్తున్న ఐకేపీ ఉద్యోగులను పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో అరెస్టు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్టాండ్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఆర్టీసీ క్రాస్రోడ్స్లలో దాదాపు 600 మందిని అరెస్టు చేసి బొల్లారం, రాంగోపాల్ పేట, గాంధీనగర్, ముషీరాబాద్ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. సోమవారం రాత్రి వరకు వారిని విడిచి పెట్టలేదు. అరెస్టయిన వారిలో సీఐటీయూ అధ్యక్షురాలు పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్, కార్యదర్శులు ఉమామహేశ్వర్రావు, ఆర్.వి. నరసింహారావు, ఐకేపీ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. బొల్లారం పోలీసు స్టేషన్లో సేఫ్‌జోన్ కింద ఉంచిన దాదాపు 400 మంది యానిమేటర్లను సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు ఇన్స్పెక్టర్ జగన్ తెలిపారు. అష్ట దిగ్బంధ ంలో ఇందిరా పార్కు ఐకేపీ ఉద్యోగుల చలో అసెంబ్లీ నేపథ్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ను పోలీసులు అష్టదిగ్బంధ ం చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ నర్సయ్యల నేతృత్వంలో వందలాది మంది పోలీసులు ఉదయం నుంచే మోహరించారు. ధర్నా చౌక్‌కు వచ్చే దారులన్నింటినీ ముళ్ల కంచెలు, బారీకేడ్లతో మూసేశారు. అనుమానితులను తనిఖీ చేశారు. . -
మొర పట్టని మొరటుతనమేల?
* సర్కారుపై ఐకేపీ యానిమేటర్ల ఆక్రోశం * వేతన బకాయిల కోసం కొనసాగిన ఆందోళన * కలెక్టరేట్ వద్ద ధర్నా, రోడ్డుపై వంటావార్పు కాకినాడ సిటీ : వారేమీ అయిదంకెల జీతాలందుకునే వారు కారు. ఇచ్చే కొద్దిపాటి గౌరవ వేతనాన్నీ నెలల తరబడి బకాయి పెడితే బతుకు గడవక కడగండ్లు పడుతున్న చిరుద్యోగులు. పదిహేను నెలల వేతన బకాయిలను చెల్లించాలని రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నా అణుమాత్రం చలించని సర్కారును నిరసిస్తూ యానిమేటర్లు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రోడ్డుపైనే వండుకుని, సామూహికంగా భోజనాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరసనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యానిమేటర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ యానిమేటర్లు 15 సంవత్సరాలుగా పేద మహిళలను సమీకరించి పొదుపు సంఘాల ఏర్పాటు, నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడం, తిరిగి కట్టించడం, రికార్డుల నిర్వహణ, ప్రతి నెలా సమావేశాల నిర్వహణ వంటి సేవలు చేస్తున్న యానిమేటర్లను అటు అధికారులు, ఇటు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మహిళలను రోడ్డెక్కేలా చేస్తోందన్నారు. పని చేసిన కాలానికి ఇవ్వాల్సిన వేతనం నెలల తరబడి చెల్లించకపోవడం దారుణమన్నారు. గౌరవ వేతనం అందక యానిమేటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యానిమేటర్ల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, బకాయిలు చెల్లించేందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. యూనియన్ అధ్యక్షుడు డి.ఆనందకుమార్, ప్రధాన కార్యదర్శి కె.మణి, అధిక సంఖ్యలో యానిమేటర్లు పాల్గొన్నారు. 24 గంటల ఆందోళనకు కొనసాగింపుగా యానిమేటర్లు గురువారం రాత్రి కూడా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే నిద్రకు ఉపక్రమించారు. -
వీఓఏలపై పోలీసుల జులుం!
కలెక్టరేట్ ఎదుట రణరంగం వేతనాలు ఇవ్వాలని రోడ్డెక్కిన మహిళలు కార్యాలయంలోకి వెళ్లకుండా డీఆర్వోను అడ్డుకున్న వీఓఏలు పోలీసుల లాఠీచార్జీ మహిళకు తీవ్ర గాయూలు వేతన బకారుుల కోసం రోడ్డెక్కిన ఐకేపీ యూనిమేటర్లపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా లాఠీలతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారం గొడ్డును బాదినట్లు బాదారు. తట్టుకోలేని వీఓఏలు తిరగబడటంతో కలెక్టరేట్ రణరంగాన్ని తలపించింది. ఈ ఘటన ప్రభుత్వ అసమర్థతకు అద్దం పట్టింది. అనంతపురం అర్బన్ : ప్రభుత్వం నుంచి రావాల్సిన 16 నెలల వేతనాల కోసం వీఓఏలు ఏపీఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బుధవారం వంట చేసుకుని అక్కడే భోజనాలు చేశారు. రాత్రి కూడా అక్కడే బస చేసి గురువారం ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి, ఏఎస్ఐ ఆషినా బేగం సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో తన కార్యాలయూనికి వెళ్లేందుకు డీఆర్ఓ హేమసాగర్ వచ్చారు. ఆయన్ను లోనికి వెళ్లకుండా మహిళలు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన మరో గేటు ద్వారా కలెక్టరేట్‌లోకి వెళ్లిపోయూరు. అక్కడే ఉన్న పోలీసులు వీఓఏలపై మండిపడ్డారు. ఆగ్రహించిన వీఓఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా మహిళలపై లాఠీచార్జీకి దిగారు. రాప్తాడుకు చెందిన వీఓఏ ఉషారాణి తీవ్రంగా గాయపడింది. సహనం కోల్పోరుున వీఓఏలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు ఒకటవ నగర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సొంతపూచికత్తుపై విడుదల చేశారు. బయటకు వచ్చిన మహిళలు కలెక్టరేట్ ఎదుట ఉన్న ఫాదర్ విన్నెంట్ ఫై విగ్రహం వద్ద సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.బాబు, కోశాధికారి శివ, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు సావిత్రమ్మ, ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, నేతలు రామాంజినమ్మ, చంద్రిక, నాగరాజు, గంగయ్య, గిరి పాల్గొన్నారు. దద్దమ్మ మంత్రులు : సీఐటీయూ అధికారి పార్టీలో ఉన్న మంత్రులందరూ దద్దమ్మలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.ఎస్.వెంకటేష్ విమర్శించారు. వేతనాలు చెల్లించకుండా వీఓఏలు ఎలా జీవిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి మృణాలిని దృష్టికి వేతనాల విషయం తీసుకెళ్లామని తెలిపారు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ఈ విషయం ప్రస్తావిస్తే ఎందామ్మ.. నీ గోల అంటూ.. సీరియస్‌గా చూశాడని మంత్రే స్వయంగా బయట చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వేతనాలు ఆపడం దారుణం : ఎమ్మెల్సీ వీఓఏల 16 నెలల వేతనాలు ఆపడం దారుణమని ఎమ్మెల్సీ గేయానంద్ పేర్కొన్నారు. వేతన బకాయిల కోసం 56 రోజుల నుంచి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్కైన తమ మొర వినిపించాలని వచ్చిన వారిపై పోలీసులు దౌర్జన్యం చేసి, అక్రమంగా అరెస్టు చేయడం మంచిదికాదన్నారు. సమస్యపై పోరాడతాం : వైఎస్సార్ సీపీ టీయూ వీఓఏల సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ అబ్జర్వర్ కొర్రపాడు హుస్సేన్ పీరా తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేసే యూనిమేటర్లకు 16 నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం బాధకరమన్నారు. -
వీవోఏలపై వికృత చర్యలు
విధుల్లో చేరకపోతే తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపు అధికారులకు అనధికారికంగా హుకుం జారీ జిల్లాలో 52రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోని సర్కార్ వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం వికృత చర్యలకు పాల్పడుతోంది. వారి నోరు నొక్కేసేందుకు దిగజారి వ్యవహరిస్తోంది. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది. 15 నెలల వేతన బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తోంది. జిల్లాలో 2,125 మంది వీవోఏలు కుటుంబాలు గడవక అల్లాడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుడ్లవల్లేరు : ఐకేపీలో డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చే విలేజ్ ఆర్గనైజ్ అసిస్టెంట్ల(వీవోఏ)ల అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. 15 నెలల వేతనాలు ఎగవేయడంతో కుటుంబాలు పస్తులుంటున్నాయి. వేతన బకాయిలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లాలో 2,125మంది వీవోఏలు సెప్టెంబరు 15 నుంచి సమ్మెబాట పట్టారు. వీరి ఉద్యమాన్ని పట్టించుకున్న పాలకులే కరువయ్యారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం చేయకపోగా ఉద్యమబాట పట్టిన వారిని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకూ వీవోఏలతో వెట్టిచాకిరి చేయించుకుని వేతనాలు కూడా ఇవ్వకుండా తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇవ్వవలసిన 15నెలల వేతనాల్ని పక్కన పెట్టి... సమ్మె నుంచి తప్పుకుని తాము చెప్పినట్లుగా విధుల్లో చేరకపోతే తొలగిస్తామని అధికారులకు అనధికార హుకుం జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలగించే హక్కే లేదు వీవోఏలను బలవంతంగా తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. సమ్మె విరమించి విధులకు రావాలంటూ బెదిరింపులకు దిగితే ఆందోళనలు తప్పవు. వారి వేతన బకాయిలు చెల్లిస్తే విధుల్లో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. బెదిరింపులు తగవు. కె.సుబ్బారావు, గుడివాడ డివిజన్ సీఐటీయూ కార్యదర్శి వేతనాలు ఎవరు ఇస్తారు జిల్లాలో 2,125మంది వీవోలకు 15నెలల వేతనాల్ని ప్రభుత్వం బకాయి పడింది. సర్కార్ మారిందని ఆ వేతనాలు మరచిపోవాలంటే ఎలా? వీవోఏలకు ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన సెల్ఫోన్లు కూడా లాక్కోవటమే కాకుండా కేసులు పెట్టే ప్రయత్నాలు చేసిన అధికారులు చేయించుకున్న పనికి వేతనాలు కూడా చెల్లిస్తే బాగుంటుంది. అప్పుడే విధుల్లో చేరతారు. ఎ.కమల, వీవోఏల సంఘ జిల్లా గౌరవాధ్యక్షురాలు