ఎల్‌ఐసీకి ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు సవరణ
న్యూఢిల్లీ: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 3వ, 4వ తరగతి తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో పాటు, వారికి వేతన బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని, సంబంధిత ప్రయోజనాలనూ కల్పించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. పూర్తి వేతన బకాయిలు చెల్లించటం వల్ల సంస్థపై భారీగా ఆర్థిక భారం పడుతుందని.. తొలుత ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ ఎల్‌ఐసీ రివ్యూ పిటిషన్ వేయటంతో.. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కార్మికులకు 50% వేతన బకాయిలు చెల్లించాలని సవరించిన ఆదేశాల్లో పేర్కొంది.
రెగ్యులరైజ్ అయ్యే ఉద్యోగులకు 50 శాతం వేతన బకాయిలు ఇవ్వాలి
Published Wed, Aug 10 2016 4:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement