‘వ్యవసాయం దండగ.. వరి సోమరి పంట’ అన్న సీఎం చంద్రబాబు నాయుడు ఐక్యరాజ్యసమితి సదస్సులో అదే అంశంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ఎద్దేవా చేశారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించని చంద్రబాబు వ్యవసాయంపై ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.