![Movva Vijaya Chaudhary launches m screens banner - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/15/aashis-gandhi-pic-4.jpg.webp?itok=_xKeFZvZ)
ఆశిష్ గాంధీ
అనసూయ లీడ్ రోల్‌లో వచ్చిన ‘కథనం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన మొవ్వ విజయ చౌదరి నూతనంగా ఎం స్క్రీన్స్ బ్యానర్‌ను నెలకొల్పారు. ఈ పతాకంపై మూడు సినిమాలు నిర్మించనున్నారు. మొవ్వ విజయ చౌదరి మాట్లాడుతూ–‘‘డిసెంబర్‌లో తొలి చిత్రం ప్రారంభం కానుంది. ఇందులో ‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా నటిస్తారు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించనున్నారు. నందినీరెడ్డి, పరశురామ్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన స్మరణ్ రెడ్డి, ఆర్.సురేష్ దర్శకత్వంలో రెండో, మూడో సినిమా నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రవిశంకర్, కొండబత్తుల నాగశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment