![Banner that led to controversy - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/11/baner.jpg.webp?itok=CAOKkauw)
బొమ్మనహళ్లి: టిప్పు జయంతిని పురస్కరించుకొని బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి పేరుతో మంగమ్మపాళ్యలో కొంతమంది వ్యక్తులు బ్యానర్ ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీరిసింది. మంగమ్మ పాళ్యలో అధిక శాతం ముస్లిం సముదాయం ప్రజల ఉన్నారు. ముస్లిం సముదాయం ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కొందరు వ్యక్తులు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బ్యానర్‌ను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ముస్లిం ఓట్ల కోసం ఎమ్మెల్యే రాజకీయం చేస్తున్నారని కామెంట్లు జోడించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్ రెడ్డి అనుచరులు అక్కడికి వచ్చి బ్యానర్ తొలగించారు. ఎమ్మెల్యే ఎం.సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సముదాయానికి బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. కేవలం టిప్పు జయంతి నిర్వహణకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఆ బ్యానర్ తమ కార్యకర్తలు ఏర్పాటు చేయలేదన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ బ్యానర్ ఏర్పాటు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment