చిన్న బడ్జెట్‌ సినిమాలను ఎంకరేజ్‌ చేసేందుకు కొత్త బ్యానర్‌ | New Production Venture Amazing Screen Reels Launched | Sakshi
Sakshi News home page

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయనున్న ASR

Published Sun, Feb 26 2023 5:32 PM | Last Updated on Sun, Feb 26 2023 5:32 PM

New Production Venture Amazing Screen Reels Launched - Sakshi

భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ వ్యాపార వేత్త బి.శ్రీరంగం శ్రీనివాస్(GSR). సినిమా మీద ఉన్న మక్కువతో నూతనంగా ”ASR ”(Amezing Screen Reels) బ్యానర్‌ ఏర్పాటు చేస్తూ  ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు  సముద్ర, నిర్మాతలు శోభారాణి ,లగడపాటి  శ్రీనివాస్, అర్జున్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బి.సత్యనారాయణ, యల్.బి.నగర్ పి.వి.కె మల్టీప్లెక్స్‌ ఓనర్ పి. విజయ్ కుమార్, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొని ASR లోగోను గ్రాండ్ గా  విడుదల చేశారు. 

అనంతరం డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ.. 'తెలుగు చిత్ర పరిశ్రమలో డి.రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్, నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ, సూపర్ గుడ్ ఫిలిమ్స్, మైత్రి మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఏవియం ప్రొడక్షన్ సంస్థలు ఎన్నో సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నాయి. ఆ సంస్థల్లాగే ఇప్పుడు వచ్చిన ASR సంస్థ మంచి చిత్రాలు నిర్మిస్తూ ఒక గొప్ప సంస్థగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.

నిర్మాత శోభారాణి మాట్లాడుతూ.. 'ASR పేరు చాలా అద్భుతంగా ఉంది. వరల్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మంచి, చెడు నేర్పించేది సినిమా. ఇలాంటి సినీ ఇండస్ట్రీని కొన్ని లక్షల మంది నమ్ముకొని జీవిస్తున్నారు. వారిలో టాలెంట్  ఉన్న వారికి సపోర్ట్ గా నిలవడానికి ASR ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒక అమ్మలాంటిది. అలాంటి సినిమా ఫీల్డ్ అక్కున చేర్చుకుంటే ఆకాశానికి హద్దు లేదు అన్నట్లు ఉంటుంది' అన్నారు.

ASR వ్యవస్థాపకులు శ్రీరంగం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు అందరూ వచ్చి  మా ASR లోగో  లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు సినిమా అంటే ఇష్టం.సినిమా మీద ఉన్న మక్కువతో సినిమానే ప్రాణంగా భావించి యంగ్ న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ & ఎగ్జిబిటర్స్ అందరికీ సపోర్ట్ గా నిలవాలని "ASR "సంస్థను స్థాపించాను.వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. అలా మా మొదటి అడుగుకు మీ అందరి ఆశీర్వాదం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సంస్థ ద్వారా అనేక సినిమాలు నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటాం అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement