జిల్లాలో పారిశ్రామిక రంగంపై ఆసక్తిగల వారికి వివిధ పరిశ్రమల స్థాపనకై బ్యాంకు రుణాలు, సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ప్రసాదరావు చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నూతన సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ, అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పరిశ్రమలపై అవగాహనకు చర్యలు
Oct 19 2016 7:15 PM | Updated on Sep 4 2017 5:42 PM
ఏలూరు (మెట్రో)
జిల్లాలో పారిశ్రామిక రంగంపై ఆసక్తిగల వారికి వివిధ పరిశ్రమల స్థాపనకై బ్యాంకు రుణాలు, సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ప్రసాదరావు చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నూతన సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ, అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జెడి ప్రసాదరావు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసమరైన అన్ని అనుమతులు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ విధానం ద్వారా లభిస్తాయని ఆయన చెప్పారు. వివిధ పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు రుణాలు, సబ్సిడీ వంటి వివరాలను అవగాహన చేసుకుని పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుని పూర్తి అవగాహన పొందిన వారికి ప్రభుత్వం తమవంతు సహకారాన్ని లబ్ధిదారులకు అందిస్తుందని ప్రసాదరావు చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ప్రస్తుతం చేసుకున్న వ్యాపారాల అభివద్ధికి బ్యాంకు రుణాలు, అవగాహన కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తల సమస్యలను, సలహాలను అధికారులు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన సూచనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడ్‌బ్యాంకు మేనేజర్ సుభ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు ఎజిఎం రామప్రభు, నాబ్‌కాన్స్ సెక్టోరియల్ హెడ్ సుభ్రహ్మణ్యం, ప్రసాద్, ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, జిల్లా పరిశ్రమల డిప్యూటీడైరెక్టర్ పి.ఏసుదాసు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు పాల్గొన్నారు.
Advertisement
Advertisement