ఒకప్పుడు మంత్రుల మాటకు తిరుగుండేదే కాదు. వారు చెప్పినట్టు చేయకుంటే తదనంతర పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండేవి. అటువంటిది ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యమైన మంత్రులకు కూడా దిక్కూమొక్కూ ఉండటం లేదు. వారి మాటలు, ఆదేశాలు,
మన వారంతా అనామకులేనా..!
Published Sun, Nov 27 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ఒకప్పుడు మంత్రుల మాటకు తిరుగుండేదే కాదు. వారు చెప్పినట్టు చేయకుంటే తదనంతర పరిణామాలు కూడా అదే స్థాయిలో ఉండేవి. అటువంటిది ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యమైన మంత్రులకు కూడా దిక్కూమొక్కూ ఉండటం లేదు. వారి మాటలు, ఆదేశాలు, సిఫారసులు గాలిలో కలిసిపోతున్నాయి. వారు కూడా అధికార దర్పం ఉంటే అదే చాలు! అని సరిపెట్టుకుంటున్నారు. బుగ్గ కారులో తిరుగుతున్నామా.. లేదా! వెంట భారీ కాన్వాయ్ వస్తోందా.. లేదా! ఎక్కడికి వెళ్లినా సెల్యూట్‌లు ఉంటున్నాయా.. లేవా! అతిథి మర్యాదలకు లోటు లేదు కదా. జీ హుజూర్ అనే వందిమాగదులు వెంటే ఉంటున్నారు కదా! ఇంతకన్నా ఏమి కావాలని అనుకుంటున్నారు. ఏదైనా చినబాబు, పెదబాబు చూసుకుంటున్నారు కదా! అని సరిపెట్టుకుంటున్నారు. వారి ఆలోచనా ధోరణి ఇలా ఉండబట్టే.. అధిష్టానం దృష్టిలో ఒట్టి అనామకులుగా మిగిలిపోతున్నారన్న విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఆ వ్యవహారమేమిటో మీరూ చూడండి..
జిల్లా కేంద్రం కాకినాడ మెయి¯ŒS రోడ్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థకు అధికార పార్టీ ద్వారా నియమితులయ్యే ఒక చైర్మన్, పరిపాలనా నిర్వహణ కోసం ప్రభుత్వం ద్వారా ఒక కార్యదర్శి ఉంటారు. ఈ సంస్థ అజమాయిషీలో జిల్లాలో 180 వర కూ శాఖా గ్రంథాలయాలు, ఉప గ్రంథాలయాలు, గ్రామీ ణ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ గ్రంథాలయాలు ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్నాయి. అటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థను నడిపించే కార్యదర్శి పోస్టు ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో రాజమహేంద్రవరంలోæ గ్రేడ్–1 అధికారి మారిశెట్టి సత్యనారాయణ ఇ¯ŒSచార్జిగా కొనసాగుతున్నారు. ఆయననే అక్కడ పూర్తిస్థాయిలో కొనసాగించాలనుకున్నారు. అలా అనుకున్నది ఏదో ఆషామాషీ నేతలు కాదు. సీఎం తరువాత సీఎంగా చెప్పుకునే పచ్చని సీమకు చెందిన ఒక మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆ జాబితాలో ఉన్నారు. వారంతా పట్టుబట్టి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా సత్యనారాయణను పూర్తిస్థాయిలో నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రప్పించారు. రెండున్నర నెలల క్రితం ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు.
అంతలోనే..
కారణమేమిటో తెలియదు కానీ గుంటూరు జిల్లాకు చెంది న ఓ గ్రంథాలయ అధికారి ఈ పోస్టుపై మనసు పారేసుకున్నాడట! తూర్పు గోదావరి జిల్లాలో పని చేయాలనేది అతని చిరకాల కోరికట. అందుకుగానూ ఆయనో ‘సామాజిక’ మార్గం ఆలోచించాడు. ఆ మార్గంలో తీర్పులు చెప్పే ఒక పెద్దాయనను లై¯ŒSలోకి తీసుకున్నాడట. ఆ పెద్దాయన ముఖ్యనేతకు దూరపు చుట్టమట. ఆ ముఖ్య నేతను పలు కేసుల్లో నుంచి ఒంటిచేత్తో బయటపడేసినట్టు కూడా ఆయనకు పేరుంది. అంతటి పెద్దాయనే చెబుతుంటే ముఖ్యనేత కార్యాలయంలో ఎవరైనా ఏం చేస్తారో.. ఇప్పుడు కూడా బుద్ధిగా అదే చేస్తున్నారు. చినబాబు నుంచి పెదబాబు వరకూ అంతా కూడా ఓకే చేసేయడంతో నిబంధనలు, మార్గదర్శకాలు, మానవీయ కోణాలు అన్నీ గాలిలో కలిపేస్తున్నారు. నియామకం జరిగి రెండు నెలలు కూడా గడవకుండానే సత్యనారాయణకు పొగ పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన ఏడాదిన్నరలో రిటైర్ కానున్నారు. అటువంటిది ఆయనను ఇంత తక్కువ సమయంలో మార్చేయాలనుకుంటున్నారు. ఈ పోస్టుకు ఏకంగా ముఖ్యమైన నాయకుడి కార్యాలయం నుంచి సిఫారసు రావడంతో.. అడ్డుచెప్పే ధైర్యం ఎవరికి ఉంటుంది? రెండు, మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చేస్తాయన్నదే ప్రస్తుతం ఉన్న సమాచారం.
తప్పించుకు తిరుగువారు ధన్యులు..
ముఖ్యనేత ప్రమేయం ఉండడంతో.. సత్యనారాయణ నియామకం సమయంలో అన్నీ తానై చూసిన జిల్లాకు చెందిన మంత్రి ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశాడట. మెట్టసీమకు చెందిన ఒక నియోజకవర్గ ముఖ్యనేత ‘పైవాళ్లతో వ్యవహారం గమ్మునుండవయ్యా!’ అంటూ సినీ స్టయిల్‌లో చెప్పడంతో ముఖం చాటేశారట. ఎవరో చెప్పారని నిన్నగాక మొన్న వచ్చిన కార్యదర్శిని ఎలా పంపిచేస్తారని గ్రంథాలయ సంస్థ ఉద్యోగులంతా ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తప్పించుకు తిరుగువారు ధన్యులు అనుకుంటూ జిల్లాకు చెందిన నేతలు కిమ్మనడంలేదు. ఆ అధికారిని ఏం చేస్తారో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement