క్రీడల్లోనూ దేశఖ్యాతిని చాటాలి
క్రీడల్లోనూ దేశఖ్యాతిని చాటాలి
Published Tue, Dec 6 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
కాకినాడ రూరల్: విద్యతో పాటు క్రీడల్లో నైపుణ్యం ఉంటే దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందవచ్చని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా క్రీడామైదానంలో రెండు రోజులపాటు జరిగే జిల్లా స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను ఆయన రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో కలసి ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. క్రీడల్లో సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్, పీవీ సింధు లాంటి క్రీడాకారులు ఎంతో మంది తమ క్రీడల్లో తమ ప్రతిభను దేశ, విదేశాల్లో చాటారన్నారు. జిల్లాలో ప్రతి మండలంలోను క్రీడలను అభివృద్ధి చేసేందుకు వీలుగా రూ. 20 లక్షలు కేటాయించామన్నారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక క్రీడా స్టేడియంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనిలో భాగంగా తుని, సామర్లకోట, కొత్తపేట, రామచంద్రపురంలో క్రీడా స్టేడియంలు నిర్మించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంతలక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అంశాలకు సంబంధించి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే అనంతలక్ష్మిలు ఆర్చీరీ పోటీలను ప్రారంభించడంతో క్రీడలు ప్రారంభమయ్యాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీలతో పాటు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మురళీధరన్, ఎంపీపీ పుల్ల సుధాచందు, జెడ్పీటీసీ సభ్యురాలు కాకరపల్లి సత్యవతి, జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మట్టా ప్రకాష్‌గౌడ్, వ్యాయామోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు లంక జార్జి, కోచ్‌లు రంగారావు, రవిరాజు, శ్రీరామమూర్తి, వ్యాయామోపాధ్యాయులు నూకరాజు, హరిబాబు, సునీత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement