జిల్లాలో 19.4 మి.మీ. వర్షపాతం నమోదు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో గత 24 గంటల్లో 19.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని సీపీఓ బాలకృష్ణ శనివారం తెలిపారు. అత్యధికంగా ఆచంట మండలంలో 94.8 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, పోడూరు 67.4, యలమంచిలి 60, పెనుగొండ 51.4, వీరవాసరం 50, పెంటపాడు 35.6, తణుకు 28.4, ఉండ్రాజవరం 25.8, పెరవలి 35.2, ఇరగవరం 33.2, అత్తిలి 38.4, ఉండి 49.2, ఆకివీడు 39.6, కాళ్ల 26.4, భీమవరం 45, పాలకోడేరు 48, పెనుమంట్ర 47, పాలకొల్లు 45, జీలుగుమిల్లి 2, బుట్టాయిగూడెం 3, పోలవరం 17, నిడదవోలు 3, తాడేపల్లిగూడెం 7, ఉంగుటూరు 2.4, పెదవేగి 1.4, పెదపాడు 6.4, ఏలూరు 11, దెందులూరు, నిడమర్రులలో 7.4, గణపవరం 2.6, నర్సాపురం 9, మొగల్తూరు 15, కుకునూరు 11, వేలేరుపాడు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.