
జిల్లాలో వర్షపాతం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
సంబేపల్లెలో 38.4 మి.మి
కడప అగ్రికల్చర్ :
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు సరాసరి జిల్లాలో 3.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెండ్లిమర్రి 8.0, ఖాజీపేట 8.4, కమలాపురం 10.0, రాయచోటి 8.8, చిన్నమండెం 6.6, టి.సుండుపల్లె 19.4, ఓబులవారిపల్లె 17.6, లింగాల 5.5 మి.మీ వర్షపాతం నమోదైంది.