జీఎస్టీ (గూడ్స్ సేల్స్ టాక్స్) కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలను మార్చుకోకుంటే భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అనేకరీతుల్లో నిరసనలు తెలిపారు.
ఆందోళన మరింత ఉధృతం చేస్తాం
Published Mon, Oct 17 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
– జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు
ఏలూరు (మెట్రో) : జీఎస్టీ (గూడ్స్ సేల్స్ టాక్స్) కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలను మార్చుకోకుంటే భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు అనేకరీతుల్లో నిరసనలు తెలిపారు. ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ ఆఫీస్ సబార్డినేట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గెజిటెడ్ అధికారులు సమైక్యంగా ఈనెల 3 నుంచి 16 వరకూ భోజన విరామ సమయంలో రాష్ట్ర కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. 17న సామూహిక సాధారణ సెలవులు పెట్టి జీఎస్టీ కౌన్సిల్‌కు నిర్ణయాలకు నిరసన తెలిపారు. ఢిల్లీలో 18, 19, 20 తేదీల్లో సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ తమ నిర్ణయాలు మార్చుకోకుంటే 20న ఏఐసీసీటీఏ ఇచ్చే పిలుపుమేరకు తమ భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తామని ఉద్యోగులు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరావు, ఏపీ సిటీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఇసి మెంబర్ ఎండీ మస్తాన్, ఎస్.శ్రీనివాసరెడ్డి, జి.జి.ఎస్.ఎస్. ఫణికుమార్ తదితరులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement