జిల్లాకు రూ.60 కోట్ల కొత్త కరెన్సీ
Published Wed, Dec 7 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
– మళ్లీ రూ.2వేల నోట్లే..
కర్నూలు(అగ్రికల్చర్): నగదు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లాకు రూ.60 కోట్ల కొత్త కరెన్సీ వచ్చింది. ఇటీవల జిల్లాకు రూ.160 కోట్లు వచ్చాయి. తాజాగా రూ.60 కోట్లు రావడంతో కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఆంధ్ర బ్యాంకు చెస్ట్‌కు రూ.40 కోట్లు, ఎస్‌బీఐ చెస్ట్‌కు రూ.20 కోట్లు వచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని ఏఏ బ్యాంకుకు ఎంతెంత ఇవ్వాలనేది ఆర్‌బీఐ సూచించింది. కాగా జిల్లాకు వచ్చిన మొత్తం అంతా రూ.2వేల నోట్లలోనే రావడం గమానార్హం. ఇప్పటికే రూ.2వేల నోట్లకు చిల్లర లభించక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మళ్లీ పెద్ద నోట్లే రావడం పట్ల బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement