జిల్లాకు రూ.160 కోట్లు
Published Sat, Dec 3 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
–అన్నీ రూ. 2000 నోట్లే
కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాకు శుక్రవారం రూ.160 కోట్ల నగదు వచ్చింది. అయితే అంతా రూ. 2000 నోట్లలోనే ఉండటం గమానార్హం. రూ.500, 100 నోట్ల అవసరం ఎక్కువగా ఉండగా రూ. 2000 నోట్లు రావడం పట్ల బ్యాంకర్లు పెదవి విరుస్తున్నారు. ఆంధ్రబ్యాంకు చెస్ట్‌కు రూ.100 కోట్లు , ఎస్‌బీఐ చెస్ట్‌కు రూ.60కోట్లు వచ్చాయి. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అన్ని బ్యాంకులకు పంపిణీ చేయనున్నారు. శుక్రవారమే ఈ నగదు కొన్ని బ్యాంకులకు వెళ్లింది. పూర్తి స్థాయిలో ఈ నగదు శనివారం బ్యాంకులకు చేరనుంది. అయితే ఇప్పటికే 2 వేల నోట్లకు చిల్లర దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. మళ్లీ రూ.160కోట్ల రూ. 2వేల నోట్లు రావడంతో చిల్లర సమస్య మరింత తీవ్రం కానుంది.
Advertisement