ప్రభుత్వంపై విశ్వాసం పోతుంది : సీఎం చంద్రబాబు
విజయవాడ : పెద్ద నోట్ల రద్దుపై పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
నోట్ల రద్దుతో అందరు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బ్యాంకర్లు వివరణ ఇచ్చారు. పది రోజుల నుంచి డిపాజిట్‌లు స్వీకరించడం తప్ప ఏ పనీ చేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో దెబ్బతిన్న చిల్లర వ్యాపారులను ఆదుకోవడానికి రూ.26 కోట్లు మంజూరు చేయడంతో పాటు ఒక్కో జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున విడుదల చేస్తామని సీఎం చెప్పారు. నగదు రహిత రూపే కార్డు లావాదేవీలపై సర్వీస్ ఛార్జ్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతానని చంద్రబాబు తెలిపారు.