‘ఏసీ రూముల్లో కూర్చుని ఉపన్యాసాలా..’
గుంటూరు: పెద్దనోట్ల రద్దుపై వైఎస్సార్ సీపీ నేత మోపీదేవి వెంకటరమణ ఫైర్ అయ్యారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కనీసం వంద రూపాయలు తెచ్చుకొనేందుకు కూడా సామాన్యుడు చాలా కష్టపడుతున్నాడన్నారు. బడా బాబులకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏసీ రూముల్లో కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, ప్రజల్లోకి వచ్చి అసలు ఇక్కట్లను చంద్రబాబు గమనించాలని మోపిదేవి సూచించారు.